గత అయిదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ శాసన సభా సమావేశాలు చూసిన వారికి… ప్రస్తుత శాసన సభా సమావేశాలు చూస్తున్న వారికి కాస్త భిన్నమైన అనుభూతి కలగడం ఖాయం. గతంలో సభ్యుల సంగతి ఎలా ఉన్నా స్పీకర్ గా వ్యవహరించిన వ్యక్తి మాత్రం అత్యంత దారుణంగా… తన హోదా మరిచి ఆ పదవిలో ఉండటం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై కనీస గౌరవం లేకుండా ప్రవర్తించిన తీరు కూడా విమర్శలకు వేదిక అయింది. అయితే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం భిన్న వాతావరణం కనపడుతోంది.
Also Read : జగన్ ను ఫాలో అవుతున్న కేటిఆర్
ప్రధానంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యవహారశైలిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. తన అనుభవాన్ని అయ్యన్న వినియోగిస్తున్న తీరు పట్ల ప్రసంశలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ఒక భోజనం, తమకు ఒక భోజనం వద్దని సీరియస్ అయిన అయ్యన్న… అధికారులను, కాంట్రాక్ట్ సంస్థను వెంటనే నిలదీశారు. ఆ తర్వాత కాంట్రాక్ట్ సంస్థను విధుల నుంచి తప్పించారు. అలాగే యువ ఎమ్మెల్యేలు సభలో ఎలా వ్యవహరించాలి అనేది స్వయంగా అయ్యన్న తన అనుభవాలతో వివరించి చెప్పారు. సభా మర్యాదలు, క్వశ్చన్ అవర్, జీరో అవర్ సహా పలు అంశాలను కొత్త సభ్యులకు స్పష్టంగా వివరించారు.
Also Read : జగన్ పై వైసీపీ ఎమ్మెల్యేల ఆగ్రహం..!
ఇక తాజాగా క్వశ్చన్ అవర్ కు మంత్రులు ఆలస్యంగా రావడం పట్ల సభలోనే అయ్యన్న సీరియస్ అయ్యారు. కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ కు స్పీకర్ అయ్యన్న చురకలు అంటించారు. ప్రశ్నోత్తరాల సమయానికి అసెంబ్లీలో మంత్రి లేకపోవడంతో ప్రశ్నను వాయిదా వేయడం పట్ల మంత్రి సీరియస్ అయ్యారు. అనంతరం వచ్చిన మంత్రిని ప్రశ్నోత్తరాల సమయాన్ని సీరియస్ గా తీసుకోవాలని సూచించారు. మంత్రులే లేట్ గా వస్తే ఎలా అంటూ నిలదీసిన స్పీకర్… సకాలంలో వచ్చేందుకు మంత్రులు ప్రయత్నించాలని కోరారు. ఇక అయ్యన్న సీరియస్ కావడంతో మంత్రి సుభాష్ క్షమపణలు చెప్పారు. ఇలా సభలో అయ్యన్న తన మార్క్ ను స్పష్టంగా చూపిస్తున్నారు.