Friday, September 12, 2025 10:54 PM
Friday, September 12, 2025 10:54 PM
roots

మదనపల్లి ఫైల్స్ ఘటనలో పెద్దిరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..!

ఆంధ్రప్రదేశ్ లో గత నాలుగు నెలల నుంచి మదనపల్లి ఫైల్స్ విషయంలో ప్రజల్లో కాస్త ఆసక్తి ఉంది. అసలు ఈ కేసు విషయంలో ఏ విధంగా అడుగులు పడతాయో అని అందరూ ఎదురు చూస్తున్నా… కేసు మాత్రం ముందుకు వెళ్ళడం లేదనే అసహనం ప్రజల్లోనూ, టిడిపి క్యాడర్ లోనూ బలంగా ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పాత్ర ఉందనే ఆరోపణలు, సాక్ష్యాలు ఉన్నా.. ఎందుకు ముందుకు అడుగులు వేయడం లేదని టీడీపీ కార్యకర్తలే ప్రశ్నించే పరిస్థితి. ఈ తరుణంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. మదనపల్లి ఫైల్స్ విషయంలో కీలక అడుగు పడింది.

Also Read : ఆ ఇద్దరూ చేసిన పాపం ఏంటీ…?

మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో దస్త్రాల దహనం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సబ్ కలెక్టర్ ఆఫీస్ లో పని చేసే సిబ్బందే దస్త్రాలను ఉద్దేశపూర్వకంగానే కాల్చినట్లు సీఐడీ ప్రాథమిక నివేదికలో స్పష్టంగా వెల్లడించారు. ఇద్దరు ఆర్డీవోలు, సీనియర్ అసిస్టెంట్ పై అభియోగాలు నమోదు చేసారు అధికారులు. 22 ఏ, అసైన్డ్ భూములపై అక్రమంగా హక్కులు సాధించినట్లు గుర్తింపు అక్రమాల ఆధారాలు ఉండకూడదనే రికార్డులు దహనం చేశారని సీఐడీ నివేదికలో స్పష్టంగా పొందుపరిచింది.

Also Read : మట్కా వర్సెస్ కంగువ.. నెగటివ్ పబ్లిసిటీ దెబ్బ ఎవరికి?

సీఐడీ నివేదిక ఆధారంగా మదనపల్లె పూర్వ ఆర్డీవోలు మురళి, హరిప్రసాద్ పై అభియోగాలు నమోదు అయ్యాయి. సీనియర్ సహాయకుడు గౌతమ్ తేజ్ నాయుడు పైనా అభియోగాలు నమోదు చేసారు. కుట్రపూరిత పనులపై అభియోగాలు నమోదు చేస్తూ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసారు. 22 ఏ నిషిద్ధ జాబితాలోని 500 ఎకరాల్లో అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడి అయింది. 13 వేల ఎకరాల అసైన్డ్ భూములు సొంతం చేసుకునేందుకు అక్రమాలు చేశారని అందులో ప్రస్తావించారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్