Saturday, September 13, 2025 03:13 AM
Saturday, September 13, 2025 03:13 AM
roots

పిల్ల సజ్జల గ్యాంగ్ కి షాక్ ఇచ్చిన హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ లో గత కొన్నాళ్ళుగా రెచ్చిపోతున్న వైసీపీ సోషల్ మీడియా ఉన్మాదుల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న నేపధ్యంలో… వైసీపీ నేతలు కోర్ట్ మెట్లు ఎక్కుతున్నారు. వ్యక్తిగత విషయాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వారి విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించిన నేపధ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చేపడుతున్నారు. కీలక వ్యక్తులపై ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేసారు. సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి, వర్రా రవీంద్రా రెడ్డి, ఇంటూరి రవి కిరణ్ సహా పలువురిపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. వీరి వాంగ్మూలం ఆధారంగా మరికొంత మంది పై కేసులు నమోదు చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది.

Also Read : ఆ పదవి కోసం ఎందుకంత పోటీ..?

ఈ బూతుల వ్యవహారంలో… మొత్తం 45 మందిని పోలీసులు గుర్తించారు. వారు అందరిని ఒక్కొక్కరిగా అరెస్ట్ లు చేస్తున్న పోలీసులు… త్వరలోనే సజ్జల భార్గవ్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ తరుణంలో కోర్ట్ లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయగా దానిపై హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెడుతున్నవారి పై పోలీసులు కేసులు పెడుతున్నారంటూ పిల్ వేయడం పై హైకోర్ట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అసభ్యకర పోస్టుల పెట్టిన వారి పై పోలీసులు కేసులు పెడితే తప్పేముందని ప్రశ్నించింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కాకుండా.. వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ అసభ్యకరంగా పోస్టులు పెడితే అరెస్ట్ ఎందుకు చేయకూడదు అంటూ సూటిగా ప్రశ్నించింది.

Also Read : మరోసారి చంద్రబాబు మాస్ వార్నింగ్‌…!

ఒక దశలో న్యాయమూర్తులను కూడా అవమానపర్చేలా పోస్టులు పెట్టారని వ్యాఖ్యానించిన ధర్మాసనం… పోలీసుల చర్యలను నిలువరిస్తూ ఎలాంటి బ్లాంకెట్ ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. పోలీసులు కట్టిన కేసులు పై అభ్యంతరం ఉంటే సంబంధిత వ్యక్తులు నేరుగా కోర్టు ను ఆశ్రయించవచ్చని ఈ సందర్భంగా కోర్ట్ ప్రస్తావించింది. అసభ్యకర పోస్టులు పెడుతున్నవారి పై పోలీసులు చట్ట నిభందనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటే తాము ఎలా నిలువరించగలమని కోర్ట్ వ్యాఖ్యానించింది. పిల్ లో తగిన ఉత్తర్వులు ఇస్తామని స్పష్టం చేసింది. సోషల్ మీడియా ఆక్టివిస్ట్ ల పై పోలీసులు మూకుమ్మడిగా కేసులు నమోదు చేయడం పై జర్నలిస్టు విజయబాబు వేసిన పిల్ పై హైకోర్ట్ లో విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్