Saturday, September 13, 2025 12:34 PM
Saturday, September 13, 2025 12:34 PM
roots

తెలంగాణాలో పెద్ద పులుల సందడి.. శుభం అంటున్న అటవీ శాఖ

తెలంగాణాలో ఇప్పుడు బెబ్బులి సందడి ఎక్కువైంది. ఒకటి కాదు రెండు పెద్ద పులులు నిర్మల్ జిల్లాలో అడుగు పెట్టాయి. మంచిర్యాల జిల్లాలో కూడా ఓ పులి జాడను గుర్తించారు అధికారులు. నిర్మల్ జిల్లా ప్రజలకు బెబ్బులులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో అటవీ శాఖ అధికారులు అలెర్ట్ అయ్యారు. ఇప్పటికే నర్సాపూర్ అడవిల్లోకి జానీ అనే పులి ఎంట్రీ ఇచ్చింది. తోడు కోసం మగపులి జానీ ప్రయాణం మొదలుపెట్టింది. మహాబూబ్ ఘాట్ లో మరో పులిని అధికారులు గుర్తించారు.

Also Read : భయమా.. వ్యూహమా?

రెండు ఒకటేనా అన్న కోణంలో అటవిశాఖ విచారణ చేస్తోంది. సారంగాపూర్ మండలం మహబూబ్ ఘాట్లో అర్థరాత్రి బెబ్బులి హల్చల్ చేయడంతో స్థానిక ప్రజలు భయపడిపోయారు. రాణాపూర్ అటవీ శాఖ పరిదిలోని క్లాక్ టవర్, అటవీశాఖ తనిఖీ కేంద్రం నడుమ సారంగాపూర్ వైపు నుంచి మామడ వైపు వెళ్తూ వాహన దారుల కంటపడింది. రోడ్డు దాటు తున్న పులిని వీడియోలను‌ సెల్ ఫోన్ లో వాహనదారులు రికార్డ్ చేసారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. మూడు టీంలతో కొనసాగుతున్న టైగర్ సెర్చ్ ఆపరేషన్ ను కొనసాగుతున్నారు. పది రోజుల క్రితం కుంటాల మండలంలోకి ఆరున్నరేళ్ల జానీ పులి ఎంట్రీ ఇచ్చింది. నర్సాపూర్ ( జి ) మండలం అడవుల్లో జానీ పులి సంచరిస్తుందని గుర్తించారు. 15 కు‌పైగా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి… మూడు బృందాల తో ట్రాకింగ్ చేస్తున్నారు. పులుల సంచారం శుభసూచకమని అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. అడవులు పెరగడంతోనే పులులు వస్తున్నాయని అటవీ శాఖ అధికారులు చెప్పడం గమనార్హం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జగన్ పరువును వారే...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే.....

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

పోల్స్