ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్దమైంది. ఎన్నికల కారణంగా వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను వైసీపీ సర్కార్ ప్రవేశ పెట్టగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం అదే కొనసాగిస్తూ వచ్చింది. నేడు బడ్జెట్ ను ఆర్ధిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టనున్నారు. బడ్జెట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పక్కా కసరత్తు చేసింది. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం వాయిదా ఉభయ సభలను స్పీకర్ వాయిదా వేయనున్నారు. అనంతరం అసెంబ్లీ స్పీకర్ అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశం జరగనుంది.
Also Read : సారీ అన్న… నేను కూడా పోతున్నా… మరో మహిళా నేత క్లారిటీ..!
ఈ సమావేశం లో ఎప్పటివరకు సభ నిర్వహించాలి? ఏయే అంశాలపై చర్చలు, చేపట్టాల్సిన బిల్లులు పై శాసనసభ వ్యవహారాల కమిటీ చర్చించనుంది. సుమారు 10 రోజులు పాటు అసెంబ్లీ నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. గత ప్రభుత్వ హయాంలో భారీగా ఆర్థిక అవకతవకలు జరిగాయని, అసెంబ్లీ వేదిక గా మరోసారి రాష్ట్ర ప్రజలకు వివరిస్తామని ప్రభుత్వం చెప్తోంది. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బాయ్ కాట్ చేస్తోంది. ఉదయం 10:30 గంటలకు వైసీపీ ఎమ్మెల్యేలతో జగన్ భేటీ అయి పలు అంశాలపై వివరణ ఇవ్వనున్నారు.
Also Read : తమదాక వచ్చాకే నొప్పి తెలిసిందా..!
అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావద్దని నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే. జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు వైసీపీ నిరసనగా సమావేశాలను బాయ్ కాట్ చేయాలని భావిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు మాక్ అసెంబ్లీ నిర్వహించే అవకాశం ఉంది. అయితే కౌన్సిల్‌కు మాత్రమే వైసీపీ ఎమ్మెల్సీలు హాజరు కావాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అసెంబ్లీలో బలం లేకపోవడం, అలాగే ప్రభుత్వం లేవనెత్తే అంశాలకు సమాధానం చెప్పలేకపోవడంతోనే జగన్ గైర్హాజరు అవుతున్నట్టు తెలుస్తోంది. ఇక మండలిలో బలం ఉండటం, అక్కడకు జగన్ వెళ్ళే అవకాశం లేకపోవడంతో హాజరు అవుతున్నారు వైసీపీ ఎమ్మెల్సీలు.