ఏపీలో వైసీపీ నేతలు ఇప్పుడు ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్ లకు పరుగులు పెడుతున్నారు. ఐదేళ్ల పాటు ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో నాటి ప్రతిపక్ష నేతలతో పాటు మహిళలు, కుటుంబ సభ్యులు.. చివరికి చిన్న పిల్లలపై కూడా అసభ్యకరమైన ఫోటోలు, కామెంట్లు, మార్ఫింగ్ ఫోటోలు.. జుగుప్సాకరమైన వ్యాఖ్యలు.. ఇలా ఒకటేమిటి సభ్యసమాజం సిగ్గుతో తల దించుకునేలా.. అమ్మ, ఆలి, అక్క అంటూ నీచమైన పోస్టులు పెట్టారు వైసీపీ అభిమానులు. చివరికి జగన్ సొంత తల్లి, చెల్లి పై పోస్టులు పెట్టి సైకో గ్యాంగ్ అనే పేరును సార్ధకం చేసుకున్నారు కూడా. ఇక పార్టీ ఓడిన తర్వాత కూడా ఈ సోషల్ మీడియా పులులు వెనక్కి తగ్గలేదు. కూటమి ప్రభుత్వంపైన ప్రతి రోజూ తప్పుడు ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఇలాంటి వారిపై ఇప్పుడు కూటమి సర్కారు ఉక్కుపాదం మోపుతోంది.
Also Read : కేసీఆర్‌ను కలవరపెడుతున్న మరో అంశం…!
ప్రభుత్వ చర్యలతో వైసీపీ నేతల వెన్నులో వణుకు మొదలైంది. ఇప్పటికే సుమారు 200 పైన ఏపీ వ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి. వీళ్లలో సగం మంది పైగా పరారీలో ఉన్నారు. నిన్నటి వరకు అభిమాన నేత అండతో రెచ్చిపోయిన సైకో గ్యాంగ్.. ఇప్పుడు కాపాడాలంటూ అదే నేతల కాళ్లు మొక్కుతున్నారు. మరోవైపు అధినేత జగన్ కూడా సోషల్ మీడియా గ్యాంగ్ ను కాపాడుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఐదేళ్ల పాటు ప్రజల సొమ్మును తన ప్రచారం కోసం ఖర్చు చేశారు. ఇప్పుడు అదే సోషల్ మీడియా టీమ్ ను కాపాడుకునేందుకు నానాపాట్లు పడుతోంది జగన్ టీమ్.
Also Read : ఏపీ పోలీసులకి బెదిరింపు ఫోన్ కాల్స్
వైసీపీ అధినేత ఆదేశాల మేరకు ఏపీలోని అన్నీ జిల్లాల్లో వైసీపీ నేతలు పోలీసు స్టేషన్ ల ముందు బారులు తీరారు. తమ కార్యకర్తల పైన తప్పుడు కేసులు పెడుతున్నారని ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే ఈ నేతలకు అనుకొని ప్రశ్నలు ఎదురవుతుంది. ఐదేళ్ల పాటు ఇదే సోషల్ మీడియాలో వచ్చిన అసభ్యకరమైన పోస్టుల గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రజలు నిలదీస్తున్నారు. అమరావతి మహిళా రైతుల పైన, టీడీపీ, జనసేన నేతల పైన.. చివరికి పార్టీ అధినేతల కుటుంబ సభ్యులను కూడా కించపరిచేలా వ్యాఖ్యలు చేసినప్పుడు ఎందుకు తప్పు పట్టలేదని ప్రశ్నిస్తున్నారు. మీ దాకా వస్తేనే నొప్పి తెలిసిందా అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. మరి వీరికి సమాధానం చెప్పే దమ్ము జగన్ వద్ద ఉందా?