Friday, September 12, 2025 10:52 PM
Friday, September 12, 2025 10:52 PM
roots

వైసీపీలో ఆ సీనియర్ నేత పరిస్థితి ఏమిటో..?

ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. ఎన్నికల్లో కేవలం 11 సీట్లు మాత్రమే రావటంతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ఇక కీలక నేతలంతా ఓడిపోయారు. ఇందుకు ప్రధానంగా జగన్ ఒంటెద్దు పోకడ నిర్ణయాలే అని వైసీపీ నేతలు కూడా విమర్శించారు. ఐదేళ్లపాటు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా కేవలం సంక్షేమ పథకాల వల్ల గెలుస్తామని జగన్ భావించాడు. ఇక ఎన్నికల సమయంలో తనని చూసి ఓటేయాలంటూ జగన్ ఓట్లు అడగటం కూడా కొంతమంది వైసిపి సీనియర్ నేతలకు రుచించలేదు.

Also Read : టార్గెట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా మృగాల వేట మొదలైంది

స్థానికంగా తమకున్న ఓటు బ్యాంకు ని కాదని జగన్ నియంతృత్వ పోకడలే ఓటమికి కారణమని సీనియర్లు అంటున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు జగన్ కు గుడ్ బై చెప్పారు. తాజాగా మరో నేత కూడా పార్టీ మారేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో సీనియర్ నేతగా ధర్మాన ప్రసాదరావుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఏపీలోనే కాకుండా అటు తెలంగాణలో కూడా ధర్మాన రాజకీయ శిష్యులు ఉన్నారు. 1989లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన ధర్మాన ప్రసాదరావు… 2014, 2024 ఎన్నికల్లో ఓడారు.

తొలి నుంచి తెలుగుదేశం పార్టీని వ్యతిరేకిస్తున్న ధర్మాన… అటు కాంగ్రెస్ పార్టీలో, ఇటు వైసీపీలో కీలకంగానే వ్యవహరించారు. అలాగే ధర్మాన సోదరులిద్దరూ జగన్ కేబినెట్ లో మంత్రులుగా చేశారు. అయితే పార్టీ ఓటమి తర్వాత ధర్మాన ప్రసాదరావు తీరుపై వైసీపీ క్యాడర్ గుర్రుగా ఉంది. పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లు పదవి అనుభవించిన ధర్మాన ప్రసాదరావు… ఇప్పుడు కనీసం పార్టీ సమావేశాలకు కూడా హాజరు కావడం లేదు. ఇక కార్యకర్తలు ఎవరైనా తమ సమస్య చెప్పుకునేందుకు వెళితే… సార్ లేరు అనే సమాధానం వస్తుంది.

Also Read : జగన్ రెడ్డి.. ఇదేందయ్యా ఇదీ…?

అయితే ధర్మాన సైలెన్స్ వెనుక పెద్ద ప్లాన్ ఉందంటున్నారు ఆయన సన్నిహితులు. త్వరలోనే ధర్మాన ప్రసాదరావు పార్టీ మారే అవకాశం ఉందంటున్నారు. అయితే అది తనకు రాజకీయంగా గుర్తింపు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలోకా.. లేక అభిమానుల సూచన మేరకు జనసేన, బీజేపీలోకా అనేది తేలాల్సి ఉంది. మొత్తానికి ధర్మాన ప్రసాదరావు సైలెన్స్ వెనుక వయొలెట్ డెసిషన్ ఉందనే మాట సిక్కోలు రాజకీయాల్లో కలకలం రేపుతోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్