Saturday, September 13, 2025 03:22 AM
Saturday, September 13, 2025 03:22 AM
roots

ఛాన్స్ ఇస్తారా..? బెంచ్ కే పరిమితం చేస్తారా..?

వరల్డ్ కప్ కంటే ఇండియాలో జరిగే సీరీస్ ల కంటే ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడటం ఇండియాకు పెద్ద పరీక్ష. గత రెండు పర్యటనలు విజయవంతంగా ముగించిన టీం ఇండియా ఇప్పుడు న్యూజిలాండ్ పై ఓటమి భారంతో అక్కడ అడుగు పెడుతోంది. దీనితో అసలు ఏ స్థాయిలో మన వాళ్ళ ప్రదర్శన ఉంటుందో అనే భయం ఫ్యాన్స్ లో ఉంది. అయితే ఇక్కడ కొత్త కుర్రాళ్ళకు ఏ స్థాయిలో అవకాశం ఇస్తారో అనే సందేహం కూడా ఫ్యాన్స్ లో ఉంది. సీనియర్ ఆటగాళ్ళు వరుసగా విఫలం అవుతూ వస్తున్నారు. దీనితో కొత్త కుర్రాళ్ళకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్ మొదలయింది.

Also Read : ఈ లెక్కలు చూస్తే కోహ్లీ, రోహిత్ కంటే పుజారా, రహానే బెస్ట్

ఆస్ట్రేలియా తో అనధికారిక టెస్ట్ మ్యాచ్ ఆడింది ఇండియా ఏ టీం. ఈ సందర్భంగా కుర్రాళ్ళు అదరగొడుతున్నారు. ఆసీస్ ఏతో మ్యాచ్‌లో భారత్‌కు సరైన స్టార్ట్ దొరకలేదు. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (0), కేఎల్ రాహుల్ (4) సహా టాపార్డర్, మిడిలార్డర్ బ్యాటర్లు ఫెయిల్ అయ్యారు. సాయి సుదర్శన్ (0), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (4) తక్కువ స్కోర్లకే అవుట్ కాగా… ఆ సమయంలో యువ ఆటగాడు ధృవ్ జూరెల్ జట్టు బాధ్యతను భుజానికి ఎత్తుకున్నాడు. సాలిడ్ డిఫెన్స్ టెక్నిక్‌తో ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు.

Also Read : టీం ఇండియా డైనమైట్

మరో యువ ఆటగాడు దేవ‌దత్ పడిక్కల్ (26)తో కలసి ఇన్నింగ్స్ ను నిర్మించాడు. పడిక్కల్ ఔట్ అయినా జురెల్ మాత్రం ఆఖరి వరకు క్రీజులో నిలబడి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్ అందించాడు. మొత్తంగా 186 బంతులు ఎదుర్కొన్న ఈ ఆర్మీ హవల్దార్ కొడుకు.. 6 బౌండరీలు, 2 సిక్సుల సాయంతో 80 పరుగులు చేసాడు. 9వ వికెట్ గా పెవిలియన్ కు చేరాడు. దీనితో ఇతనికి ఆస్ట్రేలియా పర్యటనలో తుది జట్టులో చోటు కల్పించాలి అనే డిమాండ్ వినపడుతోంది. అటు సాయి సుదర్శన్ కూడా తొలి మ్యాచ్ లో సెంచరీ చేసాడు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్