మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం సిఎం చంద్రబాబు రాజకీయ అంశాలపై, అధికారుల తీరుపై కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ చేస్తున్న సోషల్ మీడియా ప్రచారం పైనా మంత్రి వర్గంలో సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రభుత్వాన్ని కించపరిచే పోస్టులపై ఉదాసీనత తగదంటూ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్చ లేవనెత్తారు. అసభ్య, అవాస్తవ పోస్టులపై ఫిర్యాదులు వస్తున్నా కొందరు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పవన్ కళ్యాణ్ పలు కీలక అంశాలను చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్ళారు.
Also Read : కేబినేట్ లో నిర్ణయాలు ఇవే, అక్రమార్కులకు మూడినట్టే
జగన్ ప్రభుత్వం లో క్రియాశీలకంగా వ్యవహరించిన కొందరు అధికారులే ఇప్పుడూ కీలక పదవుల్లో ఉన్నారనే అంశంపైనా కీలక చర్చ జరిగింది. కొందరు అధికారుల తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని సీఎం దృష్టికి మంత్రులు తీసుకు వెళ్ళారు. పలు జిల్లాల ఎస్పీలు మంత్రుల ఫోన్ లకు సరిగా స్పందించట్లేదని మంత్రులు వ్యాఖ్యలు చేసారు. కింద స్థాయిలో డీఎస్పీ, సీఐలపై నెపం నెట్టి తప్పుకుంటున్నారని మంత్రులు చంద్రబాబుకు వివరించారు. తానూ అందుకే తీవ్రంగా స్పందించాల్సి వచ్చిందని పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు వివరణ ఇచ్చారు.
గత ప్రభుత్వం నుంచే కొందరు పోలీసులు ఇలా తయారయ్యారని ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం… సమస్యలపై ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ నెల రోజుల్లో వ్యవస్థను గాడిలోకి తెద్దామని, సోషల్ మీడియాలో అసత్య పోస్టులను ఇకపై ఉపేక్షించేది లేదని చంద్రబాబు స్పష్టం చేయగా… వివిధ శాఖల్లో పలువురు అవినీతిపరులు అధికారులుగా చలామణి అవుతున్నారని పవన్ కళ్యాణ్.. పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన సీఎం చంద్రబాబు… గత ప్రభుత్వం వల్లే పోలీసులు అలా తయారయ్యారని వ్యాఖ్యానించారు.
Also Read : పవన్ ను ఢిల్లీ ఎందుకు ఆహ్వానించినట్టు…?
వారందరినీ కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉందని… కొంతమంది డబ్బు తీసుకున్నారని కూడా ఫిర్యాదులు వచ్చాయని… నెల రోజుల్లో మొత్తం పోలీస్ వ్యవస్థను దారిలోకి తెస్తా… లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందో చూపిద్దాం అంటూ చంద్రబాబు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియా పోస్టుల పైనా ఇక ఉపేక్షేంచేది లేదని ఈ సందర్భంగా స్పష్టం చేసారు చంద్రబాబు.




