ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. ఆయన ఢిల్లీ ఎందుకు వెళ్తున్నారు అనే దానిపై క్లారిటీ లేకపోయినా… ఈ సమయంలో ఢిల్లీ వెళ్ళడం మాత్రం కాస్త సంచలనంగానే ఉంది. ఇటీవల కాకినాడ టూర్ లో పవన్ కళ్యాణ్ కొన్ని సంచలన కామెంట్స్ చేసారు. ఏపీ హోం మంత్రిని లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర దుమారమే రేపాయి. లా అండ్ ఆర్డర్ పై అలాగే పలు కీలక అంశాలపై పవన్ మాట్లాడారు. ఆ తర్వాత అనిత పని తీరుపై కూటమిలో కూడా సందేహాలు మొదలయ్యాయి.
Also Read : వర్రాకి అండగా ఉన్న కడప ఎస్పీ కి బాబు షాక్ ట్రీట్మెంట్
ఈ సమయంలో పవన్ కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ఓ వైపు పవన్ కామెంట్స్, మరోవైపు పలు నియోజకవర్గాల్లో జనసేన, టీడీపీ నేతల మధ్య విభేదాలు సంచలనం అవుతున్నాయి. పవన్ కు, సిఎం చంద్రబాబుకు మధ్య గ్యాప్ లేకపోయినా పవన్ ఎక్కడో ఇబ్బంది పడుతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. దీనితో అమిత్ షా ఆఫీస్ నుంచి పవన్ కు ఫోన్ వచ్చింది. ఎన్నికలు ముగిసి, ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తొలిసారి అమిత్ షా ని పవన్ కళ్యాణ్ కలవడానికి ఢిల్లీ వెళ్తున్నారు నెలరోజుల క్రితమే అమిత్ షా అపాయింట్మెంట్ కోరారు పవన్.
Also Read : పోలవరం విషయంలో కీలక ముందడుగు
హర్యానా, జమ్ము కశ్మీర్ ఎన్నికల బిజీలో అమిత్ షా టైం ఇవ్వలేదు. ఇటీవల చండీగఢ్ లో ఎన్డీఏ మీటింగ్ కి అటెండ్ అయిన పవన్… అదే సమయంలో మరోసారి తనకు టైమ్ కేటాయించాలని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ మేరకు ఇవాళ వచ్చి కలవాలని నిన్న మధ్యాహ్నం అమిత్ షా ఆఫీస్ నుంచి జనసేనానికి చెప్పినట్లు తెలుస్తుంది. సాయంత్రం అమిత్ షా తో భేటీ అనంతరం.. తిరిగి అమరావతికి చేరుకుంటారు పవన్. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో పలు అవినీతి వ్యవహారాలపై కూడా పవన్ నివేదికతో ఢిల్లీ వెళ్లినట్టు సమాచారం.