ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు నిర్వహించనున్న కేబినేట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవ్వాళ కేబినేట్ సమావేశం అయింది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు 1982 రిపీల్ బిల్లు ప్రతిపాదనపై చర్చించనున్న రాష్ట్ర మంత్రివర్గం, ల్యాండ్ గ్రాబింగ్ చట్టంలోని కొన్ని నిబంధనల కారణంగా భూ ఆక్రమణల్లో కేసుల నమోదుకు ఇబ్బందులు వస్తున్నట్టు గుర్తించింది. దీనిపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇక వైసీపీ హయాంలో లక్షల ఎకరాలు అన్యాక్రాంతం అయినట్టు కూటమి ప్రభుత్వం గుర్తించింది.
Also Read : నీ సేవలు చాలు.. అరబిందోకి బాబు షాక్
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి అందుతున్న ఫిర్యాదుల్లో 80 శాతం భూ ఆక్రమణల పైనే ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుత చట్టంతో అక్రమార్కులపై చర్యలకు ఇబ్బందులు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీని స్థానంలో కొత్త చట్టం తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ల్యాండ్ గ్రాబింగ్ చట్టం 1982 ను రద్దు చేయాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. కొత్తగా ల్యాండ్ గ్రాబింగ్ ప్రోహిబిషన్ బిల్లు 2024 ను తీసుకువచ్చేందుకు ప్రతిపాదనలు ప్రవేశ పెట్టనున్నారు. దీనిపై మంత్రివర్గంలో చర్చించి ఆమోదాన్ని తేలపనున్నారు.
Also Read : వాయిదా పడుతోందా.. వేస్తున్నారా…?
అలాగే నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై చర్చ జరగనుంది. వైసీపీ హయాంలోని నామినేటెడ్ పదవుల కేటాయింపు చట్టం 2019ని రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి అనుబంధంగా ఇచ్చిన జీవో 77 ను కూడా రద్దు చేయనున్నారు. 2017లో చేసిన స్మార్ట్ పల్స్ సర్వే నివేదికను నామినేటెడ్ పోస్టుల నియామకానికి ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. కొత్త క్రీడా విధానం, డ్రోన్ , సెమికండక్టర్ , డాటా సెంటర్ పాలసీలపై చర్చించి ఆమోదం కేబినేట్ ఆమోదం తెలపనుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాను 2 నుంచి 3 శాతానికి పెంపుదల ప్రతిపాదనపై చర్చిస్తారు. ఒలంపిక్స్ క్రీడల్లో బంగారు పతకం సాధించిన క్రీడాకారులకు ప్రోత్సాహకం రూ.7 కోట్ల కు పెంపుపైనా చర్చించనుంది.




