వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చూస్తే పాపం జాలేస్తుందంటున్నారు నెటిజన్లు. పాపం… ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదంటున్నారు మరి కొందరు. నిజమే… ఇది అసెంబ్లీ సమావేశాల సెషన్ తేదీ వల్ల వచ్చిన చిక్కు. తెలిసి అంటావో.. తెలియక అంటావో.. కానీ… కరెక్ట్ టైమ్ చూసి ఈ మాట అంటావు కామేశ్వరి.. అని ఎవడి గోల వాడిది సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం అన్నట్లుగా… ప్రభుత్వం తెలిసి చేసిందో… లేక తెలియకుండా చేసిందో తెలియదు కానీ… అసెంబ్లీ సమావేశాల తేదీ మాత్రం వైఎస్ జగన్‌ను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది.
Also Read : ప్రభాస్ తో ప్రశాంత్ వర్మ… ప్రాజెక్ట్ ఫైనల్ అయినట్టే..?
నవంబర్ 11వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్‌ను కూడా కలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. అనుమతి కూడా తీసుకున్నారు. ఇక ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలకు రావాలంటూ సభ్యులందరికీ లేఖలు కూడా పంపారు. అయితే ఇక్కడే వైసీపీకి అసలు సమస్య మొదలైంది. సాధారణంగా సోమవారం నుంచే అసెంబ్లీ సమావేశాలు మొదలవుతాయి. అందుకే ఈ నెల 11వ తేదీ సోమవారం నుంచి సెషన్ ప్రారంభిస్తున్నారు. ఇక మొదటి రోజునే బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంటే సరిగ్గా 11 గంంటలకు సెషన్ మొదలు. ఈ సమావేశాలను 11 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
Also Read : సోషల్ మీడియాలో అడ్డంగా బుక్కైన రోజా
ఇదే ఇప్పుడు వైసీపీని ఇరుకున పెడుతోంది. గత ఎన్నికల్లో వైసీపీకి సరిగ్గా 11 స్థానాలే వచ్చాయి. దీంతో నెటిజన్లు వైసీపీని తెగ ట్రోల్ చేస్తున్నారు. నవంబర్ నెల అంటే 11వ నెల, 11వ తేదీ, 11 గంటల నుంచి 11 రోజుల పాటు జరగనున్న శాసనసభకు 11 మంది వైసీపీ శాసనసభ్యులు వస్తారా… రారా అని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. అసలు ప్రతిపక్షమే అవసరం లేదన్న జగన్… ప్రతిపక్ష హోదా కోసం కోర్టుకు వెళ్లడం ఏమిటని కొందరు… అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు జగన్‌ను చూశాం… మళ్లీ చూస్తామో లేదో అని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి జగన్‌ను 11వ నెంబర్ తెగ ఇబ్బంది పెడుతోంది. మరి 11వ తేదీన 11 గంటలకు ప్రారంభమయ్యే శాసనసభకు 11 మందితో జగన్ వస్తాడో… రాడో చూడాలి.




