Saturday, September 13, 2025 06:47 AM
Saturday, September 13, 2025 06:47 AM
roots

పాపం కేటీఆర్… ఇలా ఇరుక్కుపోయారే..!

తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ అంటే ఓ ఫైర్ బ్రాండ్. కేసీఆర్ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన కల్వకుంట్ల రామారావు… తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేటీఆర్… హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకున్నాడు. రాజకీయాల్లో ఎంతో బిజీగా ఉండే కేటీఆర్… సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్‌గా ఉంటారు. కార్యకర్తలకే కాకుండా ఎవరికైనా సరే… ఏదైనా సమస్య ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే… వెంటనే దానిపై యాక్షన్ తీసుకుంటారు. ఇలాంటి కేటీఆర్ ఇప్పుడు నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయారు.

పదేళ్లు తెలంగాణలో ఏకాఛత్రాధిపతిగా రాజ్యం ఏలారు కేసీఆర్. అయితే బేగంపేట ప్రజా భవన్ నుంచి కేసీఆర్ బయటకు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. అయితే ఆయన స్థానంలో మంత్రి కేటీఆర్ అన్ని కార్యక్రమాలు చక్కబెట్టారు. అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో నెంబర్ టూ స్థానంలో కొనసాగారు కేటీఆర్. ఒకదశలో కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తారని.. ఆయన స్థానంలో కేటీఆర్‌ను సీఎం చేస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగింది. అయితే వీటికి స్వయంగా కేసీఆర్ చెక్ పెట్టారు. ఇక అధికారంలో ఉన్న సమయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు… ఇప్పుడు బూమ్‌రాంగ్ అవుతున్నాయి.

Also Read : వైసీపీ గేమ్‌ ప్లాన్ వర్కవుట్ అవుతుందా…?

హైదరాబాద్ నగరంలో ఎలాంటి ధర్నాలకు అవకాశం లేదన్నారు మంత్రి పదవిలో ఉన్నప్పుడు కేటీఆర్. అలాగే చంద్రబాబు అరెస్ట్ అయ్యినప్పుడు ఐటీ ఉద్యోగులు శాంతియుత ర్యాలీ నిర్వహించేందుకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతించలేదు. ఇక మెట్రోలో నినాదాలు చేసినందుకు కేసులు కూడా పెట్టారు. ఇక తెలంగాణలో ఎలాంటి ధర్నాలకు అవకాశం లేదన్నారు. అందుకే ధర్నా చౌక్ ఎత్తేస్తున్నట్లు అప్పట్లో ప్రకటించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధర్నా చౌక్‌ను మళ్లీ ఏర్పాటు చేశారు. ఇక నాటి నుంచి కేటీఆర్ ఏదో ఒక కారణంతో ధర్నాలు చేస్తూనే ఉన్నారు. అసలు ఆందోళనలే చేయకూడదన్న కేటీఆర్… ఇప్పుడు ఎందుకిలా చేస్తున్నారని పలువురు సెటైర్లు వేస్తున్నారు.

ఇక రెండు రోజుల క్రితం ఆస్క్ కేటీఆర్ పేరుతో ఎక్స్ వేదికగా ఓ లైవ్ ఏర్పాటు చేశారు కేటీఆర్. ఈ సందర్భంగా పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. మహిళలపైన, కుటుంబ సభ్యులపైన అసభ్యకరమైన కామెంట్లు చేయకూడదన్నారు. అదే సమయంలో తెలంగాణలో పార్టీ బలోపేతం చేసేందుకు త్వరలో రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఇప్పుడు ఇదే అంశంపై నెటిజన్లు ఆడుకుంటున్నారు. పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్, బీజేపీ నేతల పాదయాత్రపై గతంలో కేటీఆర్ కామెంట్లు చేశారు.

Also Read : పవన్ ఎందుకు అలా అన్నట్టు…? ఢిల్లీలో జగన్ బీ టీం గేమ్ ఆడుతుందా…?

ఎందుకు పాదయాత్ర… తిన్నది అరగక చేసే అజీర్తీ యాత్ర… అది పాదయాత్ర కాదు… ఇక్కడి నుంచి అక్కడికి నడుచుకుంటూ పోవడం ఎందుకూ అంటూ 2022లో కామెంట్ చేశారు. ఇప్పుడు ఇదే వీడియోను బయటకు తీశారు నెటిజన్లు. ఆ రోజు ఈ మాట అన్నది మీరే కదా అని కేటీఆర్‌ను ట్యాగ్ చేసి ప్రశ్నిస్తున్నారు. పదేళ్లు ప్రజల సొమ్ము తిన్నారు కదా… అది అరగక ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నావా అంటూ సెటైర్లు వేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్