Saturday, September 13, 2025 01:15 AM
Saturday, September 13, 2025 01:15 AM
roots

ప్రభాస్ తో ప్రశాంత్ వర్మ… ప్రాజెక్ట్ ఫైనల్ అయినట్టే..?

వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంటూ కూడా ఫ్యూచర్ ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తూ ఇప్పుడు బాక్సాఫీస్ పై యుద్దాన్నే ప్రకటించాడు రెబల్ స్టార్ ప్రభాస్. 5 భారీ ప్రాజెక్ట్ లు చేతిలో ఉన్నా కూడా… తర్వాతి సినిమాలపై కూడా ఓ క్లారిటీ తో ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రభాస్ చేతిలో ఇప్పుడు రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్, కల్కీ 2, సలార్ 2 ఉన్నాయి. ఒక్క సలార్ 2 ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉంది గాని… మిగిలిన సినిమాలు రాబోయే రెండేళ్ళలో పూర్తి చేసి రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. 2027 లో చేయబోయే ప్రాజెక్ట్ కూడా ప్రభాస్ ఓకే చేసేసాడు.

ఎస్ హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో సినిమా ప్లాన్ చేసాడు. ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ లో ఒక డ్రీం ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ ను బాలీవుడ్ హీరోతో స్టార్ట్ చేసినా అది ఆగిపోయింది. ఆ తర్వాత అదే కథను ప్రభాస్ కు చెప్పాడు. కాకపోతే ప్రభాస్ ఇందులో నెగటివ్ రోల్ చేస్తాడు. అయినా సరే ప్రశాంత్ చెప్పిన కథ ప్రభాస్ కు పిచ్చ పిచ్చగా నచ్చడంతో ప్రభాస్ రెడీ అయిపోయాడు. ఈ కథ కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ కు నచ్చడంతో వాళ్ళు నిర్మించడానికి రెడీ అయిపోయారు.

Also Read : ప్రభాస్ కత్తికి రెండు వైపులా పదును

అయితే ఇందులో దిల్ రాజు కూడా పెట్టుబడి పెడుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్ సినిమాతో బిజీగా ఉంటూనే స్పిరిట్ సినిమా కోసం టెస్ట్ లుక్ కు అటెండ్ అయినట్టు టాక్. స్పిరిట్ మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ కావడంతో సందీప్ రెడ్డి వంగా… ప్రభాస్ ను పిలిచాడట. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఇప్పటికే యానిమల్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో తాను ఏంటీ అనేది సందీప్ రెడ్డి వంగా ప్రూవ్ చేసుకున్నాడు. ప్రభాస్ లాంటి హీరో సందీప్ చేతిలో ఉండటంతో ఏ మ్యాజిక్ చేస్తాడో చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్