“టీడీపీ, బిజెపి, కాంగ్రెస్ పెయిడ్ సోషల్ మీడియా మనపై తప్పుడు ప్రచారం చేస్తాయి. మనం ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలి” బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ లో చేసిన పోస్ట్ లో బీఆర్ఎస్ సోషల్ మీడియాకు చేసిన దిశా నిర్దేశం ఇది. బీజేపి, కాంగ్రెస్ సంగతి పక్కన పెడితే అసలు… టీడీపీ గురించి కేటిఆర్ మాట్లాడారు. తప్పుడు ప్రచారం, ఫేక్ ఫోటోషాప్ అంటూ కేటిఆర్ మాట్లాడటం కాస్త వింతగా, విడ్డూరంగా ఉంది. అసలు గతాన్ని ఆయన మర్చిపోవడం చూసి బీఆర్ఎస్ ను అభిమానించే వాళ్ళు కూడా షాక్ అయ్యారు.
గత పదేళ్ళలో చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి, అమరావతికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా చేసిన తప్పుడు ప్రచారం గురించి ప్రజలు ఎవరూ మర్చిపోలేదు. ఇటీవల విజయవాడ వరదల సమయంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా అమరావతి మునిగింది అంటూ ప్రచారం చేసింది. విజయవాడ డ్రోన్ షాట్స్ ను పెట్టి పోస్ట్ చేసి విమర్శలు చేసారు. ఇక చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో జగన్ కు మద్దతుగా బీఆర్ఎస్ సోషల్ మీడియా పని చేయలేదా…? చంద్రబాబుకు వ్యతిరేకంగా మొన్నటి ఎన్నికల్లో సోషల్ మీడియా సైలెంట్ వర్క్ చేయలేదా…?
Also Read : ఆ డ్రగ్స్ ఎక్కడివి..? విజయ్ మద్దూరి ఫోన్ దొరికితే..!
హైదరాబాద్ బ్రాండ్ పెంచుకోవడానికి కృష్ణా నదికి వరదలు వచ్చిన ప్రతీసారి బీఆర్ఎస్ సోషల్ మీడియా చేసిన చర్యలు ఏంటీ…? అసలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలను వేధించి వైసీపీలో జాయిన్ చేయించలేదా…? అప్పట్లో వల్లభనేని వంశీ మోహన్ సహా కొందరు ఎమ్మెల్యేల మీద బీఆర్ఎస్ సర్కార్ చేసిన ఒత్తిడి ఏంటీ…? అవంతి శ్రీనివాస్ పార్టీ మారడం వెనుక కారణం ఎవరు…? మాగుంట శ్రీనివాసుల రెడ్డిని అప్పుడు ఒత్తిడి చేసింది ఏ పార్టీ నాయకులు…? టీడీపీకి 23 సీట్లు వచ్చినప్పుడు, వివేకా హత్య కేసు సమయంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేయలేదా…?
చంద్రబాబు అధికారంలోకి రాకూడదు అని బీఆర్ఎస్… వైసీపీతో కలిసి పని చేయలేదా…? ఇవన్నీ కేటిఆర్ ఎలా మర్చిపోతారు అంటూ సోషల్ మీడియాలో పలువురు ఎద్దేవా చేస్తున్నారు. చెయ్యాల్సిన తప్పుడు పనులు అన్నీ చేసి ఇప్పుడు సుద్దపూస కబుర్లు చెబితే ఎలా అంటూ కేటీఆర్ తీరు పై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు వివిధ పార్టీల అభిమానులు. అధికారంలో ఉండగా పెయిడ్ సోషల్ మీడియాను నడిపింది బిఆర్ఎస్ పార్టీ అని, వాళ్ళు విపక్ష నాయకులను ఎంతగా టార్గెట్ చేసారో అందరికి తెలుసునని, కేసీఆర్ కూడా ఎన్నికల ముందు జగన్ గెలుస్తాడు అంటూ వ్యాఖ్యానించి ప్రజలని జగన్ వైపు తిప్పే ప్రయత్నం కూడా చేసారని.. ఇప్పుడు టిడిపి పెయిడ్ సోషల్ మీడియా అంటూ వ్యాఖ్యానించటం నిజంగా సిగ్గుచేటని విమర్శిస్తున్నారు.