గత రెండు మూడు రోజులుగా… ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఆమె సోదరుడు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ కు మధ్య లేఖల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతోంది. ఈ ఇద్దరి మధ్య జరిగిన లేఖలను… షర్మిలకు, విజయమ్మకు జగన్ చేసిన అన్యాయం అంటూ టీడీపీ బహిర్గతం చేసింది. అక్కడి నుంచి షర్మిల కూడా దూకుడుగానే రియాక్ట్ కావడం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో ఇక ఆమెపై దాడి కూడా తీవ్ర స్థాయిలో వైసీపీ చేస్తోంది. జగన్ కూడా ఈ విషయంలో టీడీపీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసారు.
Also Read: జగన్‌కు పబ్లిసిటీ పీక్స్.. ఊరు వాడా ఇదే టాపిక్..!
అయితే ఇక్కడ వైసీపీ నేతలు బయటకు వచ్చి మీడియాతో ఓ మాట మాట్లాడారు. జగన్ బెయిల్ రద్దు చేసే కుట్ర జరుగుతుంది, ఎన్సీఎల్టీ కోర్ట్ లో జగన్ పిటీషన్ వేయకపోతే టీడీపీ నేతలే బెయిల్ రద్దు చేయాలనే పిటీషన్ వేస్తారని మాట్లాడారు. జగన్ బెయిల్ ఉన్నదీ అక్రమాస్తుల విషయంలో, ఇది కుటుంబ ఆస్తుల వ్యవహారం… కుటుంబ ఆస్తుల పిటీషన్ కు… బెయిల్ కు సంబంధం ఏంటీ అనేది చాలా మందికి అర్ధం కాని విషయం.
ఇక్కడ జగన్ వ్యూహం చాలా మందికి అర్ధం కావడం లేదు అంటున్నారు ఆయనను అతి దగ్గరగా గమనించే కొందరు. ప్రస్తుతం బెయిల్ రద్దు అయ్యే పరిస్థితి క్రమంగా కనపడుతోంది. ఇటీవల లోకేష్ ఢిల్లీ వెళ్ళడం, సరస్వతి పవర్ భూముల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం దూకుడు పెంచడం ఇవన్నీ జగన్ కు ఎక్కడో తేడా కొడుతున్నాయని, ఆయనకు అసలు బెయిల్ రద్దు అయ్యే సమాచారం ఉందని, అటు సిబిఐ, ఈడీ కూడా జగన్ విషయంలో సీరియస్ గా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also Read: కాపీ స్క్రిప్ట్ తో వైసీపీ నాయకులు.. అరెస్ట్ భయమే కారణమా?
అందుకే ఇప్పుడు బెయిల్ రద్దు జరిగితే షర్మిలపై, టీడీపీపై నెపం నెట్టేందుకు జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇక టీడీపీకి ఆయనే లేఖలు అందేలా చేసి ఉండవచ్చు అని అంటున్నారు. షర్మిల లీక్ చేసారని చెప్పినా ఆమె బైబిల్ పై ప్రమాణం చేయడానికి సిద్దమయ్యారు. అందుకే ఇక్కడ జగన్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.