Friday, September 12, 2025 10:59 PM
Friday, September 12, 2025 10:59 PM
roots

జగన్‌కు పబ్లిసిటీ పీక్స్.. ఊరు వాడా ఇదే టాపిక్..!

ప్రచారానికి కాదేది అనర్హం అనేది ప్రస్తుతం వినిపిస్తున్న మాట. ఇప్పుడు ఇదే మాట వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు సరిగ్గా సరిపోతుంది. సాధ్యం కాదని తెలిసి కూడా వై నాట్ 175 అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 3 రాజధానుల ప్రతిపాదనతో దేశం మొత్తం దృష్టి ఆకర్షించారు. రివర్స్ టెండరింగ్ అంటూ కాంట్రాక్టర్లను కూడా ఆశ్చర్యానికి గురి చేశారు. పరాదాల మాటున తిరుగుతూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలా ఎన్నో చిత్ర విచిత్ర నిర్ణయాలతో నిత్యం ప్రజల నోట్లో నానిన జగన్ పేరు రెండు రోజులుగా మరో కీలక అంశం వల్ల మోత మోగిపోతుంది. అదే ఆస్తి కోసం చెల్లి, తల్లి మీద కూడా కేసు వేయడం.

ఆస్తిలో వాటా కోసం కన్నతల్లి, సొంత చెల్లెలు పైన కేసు వేసిన జగన్… దీనిపై లేఖ రాశారు. అయితే ఆ లేఖకు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా బదులివ్వడంతో రెండు రోజులుగా అన్ని పత్రికల్లో ఇదే పతాక శీర్షిక. తనపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందంటే ఏ నేత అయినా సరే ఆ విషయానికి అంతటితో బ్రేక్ పెట్టేస్తారు. కానీ జగన్ మాత్రం మరోలా ఆలోచించారు. ఈ విషయాన్ని ఇంతటితో ఆపాల్సిన జగన్… మరో అడుగు ముందుకు వేశారు. తన ఇంట్లో గొడవలను పార్టీలకు అంటగట్టారు. టీడీపీ వల్లే లేఖలు రాస్తున్నారని… అవి చంద్రబాబే చేయిస్తున్నారని పొలిటికల్ టర్న్ తీసుకునేలా చేశారు. దీంతో ఈ అంశంపై కౌంటర్ ఇచ్చేందుకు టీడీపీ నేతలు జగన్ పేరు ప్రస్తావించాల్సి వచ్చింది.

Also Read: ఈ నాటకాలు ఇంకెన్నాళ్లు జగన్..?

ఇక ఆ తర్వాత నేను రూ.200 కోట్లు ఇచ్చాను అంటూ మరో లేఖ రాయడంతో… అబ్బా… అంత డబ్బు ఇచ్చాడా జగన్.. అని జనం చర్చించుకునేలా చేశాడు. ఆ తర్వాత షర్మిల కౌంటర్ లేఖ… వీటన్నిటికి తోడు… రెండు రోజులుగా ఏ ఛానల్ చూసినా ఒకటే రచ్చ… అదే అన్న చెల్లెలు మధ్య ఆస్తి తగాదాలు… జగన్ లేఖలు… దీంతో జగన్‌కు కాదనకుండా కావాల్సినంత పబ్లిసిటీ వస్తోంది. అటు సిటీ మొదలు… గ్రామాల వరకు ఏ ఇద్దరు కలిసినా సరే… జగన్, షర్మిల ఆస్తి గొడవల గురించే చర్చించుకుంటున్నారు. దీంతో నిన్నటి వరకు సైలెంట్ అయిపోయిన వైసీపీ నేతలు కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. తమ అధినేత చాలా మంచోడని… రూ.200 కోట్లు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదంటూ సోషల్ మీడియాలో కూడా తెగ పొగడుతున్నారు.

Also Read: బ్రేకింగ్: తెలంగాణా ఫోన్ ట్యాపింగ్ లో బిగ్ ట్విస్ట్

ఇటు సోషల్ మీడియాలో, అటు పత్రికల్లో, ప్రజల్లో కూడా జగన్ పేరు మారుమోగుతోంది. 11 స్థానాలు మాత్రమే గెలిచిన వైసీపీని ప్రజలు దాదాపుగా మర్చిపోయారనే మాట బలంగా వినిపిస్తోంది. మరోవైపు ఏపీకి కేంద్రం అందిస్తున్న సాయం, ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ప్రజలకు టీడీపీ, జనసేన నేతలు వివరిస్తున్నారు. అది పూర్తిస్థాయిలో జనంలోకి వెళితే జగన్‌కు మరింత డ్యామేజ్ తప్పదు. దానికి బ్రేక్ పడాలంటే… ఏదో ఒక సాకుతో ప్రజల నోట్లో నానుతూ ఉంటే… మరో నాలుగు ఓట్లు పడే అవకాశం ఉంటుందనేది వైసీపీ అధినేత ప్లాన్ అనే విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఇది కూడా ఒక రకమైనే పబ్లిసిటీ నే కదా.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్