Friday, September 12, 2025 03:22 PM
Friday, September 12, 2025 03:22 PM
roots

సాక్షికి కోర్ట్ స్ట్రాంగ్ వార్నింగ్

రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఖాతాలో… బిగ్ బ్లాస్ట్ అంటూ వైరల్ అయిన పోస్ట్ తర్వాత వైసీపీ పెద్ద ఎత్తున అదే స్థాయిలో ప్రచారం చేసింది. అయితే అనూహ్యంగా డ్రగ్స్ కేసుకి సంబంధించి టీడీపీ అనుకూల మీడియా అధినేతను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది వైసీపీ. దీనికి సంబంధించి వైసీపీ నేతలు కూడా షాక్ అయ్యారు. ఈ నేపధ్యంలో సాక్షి మీడియా, వైసీపీకి సిటీ సివిల్ కోర్ట్ బిగ్ షాక్ ఇచ్చింది. ఇటీవల ప్రసారం చేసిన పలు కథనాలపై కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

వైసీపీ సోషల్ మీడియా, సాక్షి మీడియాలో వచ్చిన కథనాలపై సిటీ సివిల్ కోర్టులో టీవీ5 ఎండీ రవీంద్రనాథ్ పిటీషన్ దాఖలు చేసారు. టీవీ5 ఎండీ రవీంద్రనాథ్‌పై రాసిన అసత్య వార్తా కథనాలను వెంటనే తొలగించాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇకపై టీవీ5 ఎండీ రవీంద్రనాథ్ పరువుకు భంగం కలిగించేలా ఎలాంటి వార్తలు రాయొద్దని కోర్టు ఆదేశించింది. జగతి పబ్లికేషన్స్, ఇందిరా టీవీ చైర్‌పర్సన్ భారతీ రెడ్డి, వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు కోర్టు విచారణ సందర్భంగా పలు ఆదేశాలు జారీ చేసింది.

Also Read : షర్మిలతో పోరాటం అంటే.. జగన్ రాజకీయ భవిష్యత్తు ముగిసినట్లేనా?

సాక్షి పేపర్ చీఫ్ ఎడిటర్, ఎడిటర్ వెంటనే మీడియాలో ఉన్న కంటెంట్ తొలగించాలని ఆదేశించింది. గూగుల్, ట్విట్టర్, యూట్యూబ్‌తో పాటు వైసీపీ అనుకూల మీడియా గ్రేట్అంధ్రలో ఉన్న కంటెంట్లు వెంటనే తొలగించాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇకపై టీవీ5 ఎండీ రవీంద్రనాథ్‌పై ఎలాంటి అసత్య, అనుచిత కథనాలు రాయొద్దని స్పష్టం చేసింది కోర్ట్. కోర్టు ఆదేశాలు ధిక్కరిస్తే చర్యలు తీసుకుంటామని సిటీ సివిల్ కోర్టు ఈ సందర్భంగా హెచ్చరించింది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్