అమరావతి రైల్వే అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం సంచలనం అవుతోంది. అమరావతి రాజధానికి 2,245 కోట్లతో 57 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రధాని నరేంద్ర మోడీ కేబినేట్. కృష్ణానదిపై 3.2 కిలోమీటర్ల పొడవైన రైల్వే వంతెన నిర్మాణం చేపట్టనున్నారు. వచ్చే నెల దీనికి శంకుస్థాపన కూడా చేయనున్నారు. మచిలీపట్నం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులను అనుసంధానిస్తూ నిర్మాణం చేపట్టనుంది కేంద్రం. అమరావతి స్తూపం, ఉండవల్లి గుహలకు వెళ్లే వారికి సులువైన మార్గంగా అభివృద్ధి చేయనున్నారు.
అమరలింగేశ్వర స్వామి ,ధ్యాన బుద్ధ వెళ్లే వారికి సులువైన మార్గంగా అభివృద్ధి చేస్తారు. అమరావతి నుంచి హైదరాబాద్, చెన్నై ,కలకత్తాకు అనుసంధానిస్తూ రైల్వే లైన్ ను నిర్మాణం చేపడుతోంది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వమే భూ సమీకరణ చేయనుంది. రైల్వే లైన్ తో దక్షిణ మధ్య ఉత్తర భారత్లో అనుసంధానం మరింత సులువు కానుంది. దీనిపై స్పందించిన సిఎం చంద్రబాబు… వచ్చే నెల శంకుస్థాపన చేయనున్నాం అని తెలిపారు. దీనికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానిస్తాను అంటూ ప్రకటించారు.
Also Read: మంత్రులూ ఎందుకీ మౌనం..? చంద్రబాబు ఆవేదన..!
అయితే ఏపీ విషయంలో, బీహార్ కు నిధులు కేటాయించే విషయంలో కేంద్ర ప్రభుత్వం దూకుడు ప్రదర్శించడం పట్ల ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. త్వరలో జరగబోయే మహారాష్ట్ర ఎన్నికల్లో బిజెపి ఓడిపోయే అవకాశం కనపడుతోంది అంటున్నాయి పొలిటికల్ సర్కిల్స్. అందుకనే ఇప్పుడు టీడీపీ గాని బీహార్ లో అధికార జేడియు గాని ఎన్డియే నుంచి బయటకు వెళ్ళకుండా జాగ్రత్త పడుతోంది బీజేపి అధిష్టానం అనే టాక్ వినపడుతోంది. అందుకే ఇప్పుడు ఏపీ విషయంలో నిధుల కేటాయింపులో జాప్యం చేయవద్దని అమరావతి నిధులు లేదంటే తెలంగాణా బకాయిలు, పోలవరం పూర్తి చేయడంపై కేంద్రం ఫోకస్ చేస్తోంది అంటున్నారు.