Sunday, September 14, 2025 02:05 AM
Sunday, September 14, 2025 02:05 AM
roots

ఎంపీ గారు… ఇలా అయితే ఎలా సార్…?

గెలిచింది తొలిసారి… కానీ గుర్తింపు మాత్రం జాతీయ స్థాయిలో వచ్చింది. పార్టీ అధినేత దగ్గర మంచి మార్కులే కొట్టేశారు… అయితే సొంత నియోజకవర్గంలో మాత్రం అప్పుడే విమర్శలు మూటగట్టుకుంటున్నారు. ఆయనే విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. సాధారణ కుటుంబం… ఓ పత్రికా విలేకరిగా పరిచయం… కింజరాపు కుటుంబంతో అనుబంధం… అన్ని కలిసి శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకదశలో ఎచ్చెర్ల అసెంబ్లీ టికెట్ కోసం మాజీ మంత్రి, సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావుతోనే పోటీ పడ్డారు.

అయితే ఎచ్చెర్ల నియోజకవర్గం టికెట్ బీజేపీకి కేటాయించడంతో కళా వెంకట్రావును చీపురుపల్లి పంపించారు. అలాగే కలిశెట్టికి విజయనగరం ఎంపీ టికెట్ కేటాయించారు. పూసపాటి కుటుంబ అండతో విజయనగరం ఎంపీగా గెలిచిన కలిశెట్టి… తొలిసారి సైకిల్ పైన పార్లమెంట్ చేరుకుని దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక అధినేత దగ్గర మంచి మార్కులు కూడా కొట్టేశారు. అయితే సొంత నియోజకవర్గంలో మాత్రం కలిశెట్టి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం.. ఆయన ప్రచార యావ అంటున్నారు.

Also Read : పొంగులేటి లీక్స్… బీఆర్ఎస్ అగ్రనేత అరెస్ట్

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌లో ఉంటున్న ఎంపీ… ఏ చిన్న సమస్య అయినా సరే.. సంబంధిత శాఖ అధికారులతో చర్చించకుండా… సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఎంపీగా అధికారులతో నేరుగా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిన ఎంపీ… ఇలా సోషల్ మీడియా ద్వారా అడగటం ఏమిటని విసుక్కుంటున్నారు. సగంలో ఆగిపోయిన రైల్వే వంతెన ఎప్పుడు పూర్తి చేస్తారు సార్.. అంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఎంపీ పోస్ట్ చేశారు. దీనిపైన విపక్ష నేతలు సెటైర్లు వేస్తున్నారు.

అధికారంలో ఉన్నారా… లేక ప్రతిపక్షంలో ఉన్నారా అని కలిశెట్టిని ట్యాగ్ చేస్తున్నారు. అదే సమయంలో స్థానిక నేతలతో ఏ మాత్రం సఖ్యంగా లేరని… ఎన్నికల సమయంలో బాగా ప్రజలతో బాగా కలిసిపోయినట్లు కనిపించిన కలిశెట్టి… ఇప్పుడు మాత్రం శ్రీకాకుళం జిల్లాకు చెందిన నేతలతోనే ఎక్కువగా గడుపుతున్నారంటున్నారు విజయనగరం జిల్లా నేతలు. ఈ వైఖరి ఇలానే కొనసాగితే ఆయనతో పాటు పార్టీకి కూడా భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని సొంత పార్టీలోనే నాయకులు మాట్లాడుకుంటున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

టార్గెట్ పంచాయితీ.. 14...

ఆంధ్రప్రదేశ్ లో ఆల్ ఇండియా సర్వీస్...

రేవంత్, కేటీఆర్ కు...

సాధారణంగా రాజకీయాల్లో వచ్చిన అవకాశాలను వాడుకోవడానికి...

కేటీఆర్ కు రేవంత్...

భారత రాష్ట్ర సమితి విషయంలో ముఖ్యమంత్రి...

జగన్ పరువును వారే...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే.....

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

పోల్స్