Sunday, September 14, 2025 01:58 AM
Sunday, September 14, 2025 01:58 AM
roots

ప్రకాశంలో జిల్లాలో రాజకీయ కుదుపు…!

ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. వై నాట్ 175 అంటూ ఎన్నికలకు వెళ్లిన పార్టీ పరిస్థితి… సరిగ్గా నాలుగు నెలల తర్వాత అసలు ఉంటుందా లేదా అనేలా మారిపోయింది. ఇప్పటికే కీలక నేతలంతా జగన్ కు గుడ్ బై చెప్పేశారు. బంధువులు కూడా జగన్ పై వ్యతిరేకంతోనే ఉన్నారు. ఇప్పుడు జగన్ కు మరో కీలక నేత షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. నేనే రాజు, నేనే మంత్రి అంటూ నిరంకుశంగా వ్యవహరిస్తున్న జగన్ తీరుతో వైసీపీ నేతలు పార్టీ అధినేతకు మొహం చాటేస్తున్నారు. అధికారం కోల్పోయినా తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదంటూ సెటైర్లు వేస్తున్నారు.

Also Read: జగన్ కు ఇక బ్యాండ్ బాజా బారాత్ మొదలు…!

ప్రకాశం జిల్లాలో కీలక నేతగా గుర్తింపు తెచ్చుకున్న కరణం బలరాం ఇప్పుడు వైసీపీకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున చీరాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ గాలిని సైతం గెలిచిన తట్టుకుని గెలిచిన కరణం… ఆ తర్వాత అనూహ్యంగా వైసీపీ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. అయితే వైసీపీలో చేరిన తొలిరోజు నుంచి కూడా నియోజకవర్గంలో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిన ఆమంచి కృష్ణమోహన్ తో ఏమాత్రం సఖ్యతగా లేదు. చివరికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్వయంగా రంగంలోకి దిగి రాజీకి యత్నించినా ఫలితం లేకుండా పోయింది.

Also Read: మెగా హీరో ఇమేజ్ వద్దనుకుంటున్న అల్లుఅర్జున్

ఇక ఎన్నికలకు ఏడాది ముందే చీరాల ఇంఛార్జి గా కరణం వెంకటేష్ ను జగన్ ప్రకటించారు. దీంతో ఆమంచి సైలెంట్ గా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బాలినేని జనసేనలో చేరడంతో త్వరలో కరణం కూడా జనసేన కండువా కప్పుకుంటారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా సీఎం చంద్రబాబుతో కరణం బలరాం భేటీ అయ్యారు. ఓ వేడుకలో ఇద్దరు సరదాగా గడిపారు. వీరితో పాటు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ కూడా ఉన్నారు. రాజకీయ భేటీ కాకపోయినప్పటికీ… ప్రకాశం జిల్లాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. అయితే తొలి నుంచి కరణం ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్ ను చంద్రబాబు ఎలా ఒప్పిస్తారో అనే అంశంపై కూడా చర్చించుకుంటున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

టార్గెట్ పంచాయితీ.. 14...

ఆంధ్రప్రదేశ్ లో ఆల్ ఇండియా సర్వీస్...

రేవంత్, కేటీఆర్ కు...

సాధారణంగా రాజకీయాల్లో వచ్చిన అవకాశాలను వాడుకోవడానికి...

కేటీఆర్ కు రేవంత్...

భారత రాష్ట్ర సమితి విషయంలో ముఖ్యమంత్రి...

జగన్ పరువును వారే...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే.....

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

పోల్స్