Friday, September 12, 2025 09:20 PM
Friday, September 12, 2025 09:20 PM
roots

పరామర్శ సరే… సాయం ఏదీ సారు….!

బాధితులను పరామర్శించారు… బానే ఉంది.. మరి సాయం మాటేమిటి అంట.. ఇదే ప్రశ్న వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను సూటిగా ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. వైఎస్ జగన్ అంటే చాలు పరామర్శలు, ఓదార్పు యాత్రలే గుర్తుకు వస్తాయి. 2009లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో కాలు పెట్టిన జగన్… కడప ఎంపీగా గెలిచారు. అయితే గెలిచిన తర్వాత సరిగ్గా మూడు నెలలకే హెలికాఫ్టర్ ప్రమాదంలో సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి దుర్మరణం పాలవ్వడంతో జగన్ జనంలోకి వచ్చాడు.

రాజశేఖర్ రెడ్డి మరణం జీర్ణించుకోలేక మృతి చెందిన వారిని పరామర్శించేందుకు ఓదార్పు యాత్ర మొదలుపెట్టారు. దీనికి తొలుత కాంగ్రెస్ నేతలు మద్దతు ఇచ్చినప్పటికీ… అధిష్టానం నుంచి అనుమతి లేకపోవడంతో ఒంటరిగానే యాత్ర చేశారు. ఓదార్పు యాత్ర సమయంలో బాధితులకు రూ.లక్ష సాయం అందించారు కూడా. కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం బాధిత కుటుంబాలను హైదరాబాద్ పిలిపించి పరిహారం ఇద్దామని సూచించింది. దీనికి జగన్ ససేమిరా అనడంతో విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. చివరికి కాంగ్రెస్ పార్టీకి జగన్ గుడ్ బై చెప్పేశాడు.

అయితే ఇదంతా గతం. ఇప్పుడు పరిస్థితి పూర్తి మారిపోయింది. వైసీపీ తరఫున సాయం పొందిన వారు ఎవరూ అని టార్చ్‌లైట్ వేసుకుని వెతికినా సరే… ఎవరూ కనిపించడం లేదు. చివరికి సొంత పార్టీ వాళ్లకు కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఖజనా నుంచి సాయం చేశారు తప్ప… పార్టీ నుంచి కనీసం రూపాయి కూడా ఇవ్వలేదు అనేది వాస్తవం. టీడీపీని, పవన్ కల్యాణ్‌ను తెగ బూతులు తిట్టిన కత్తి మహేశ్ కారు ప్రమాదంలో గాయపడితే… అతని వైద్యానికి ఏకంగా రూ.60 లక్షలు మంజూరు చేశారు జగన్…. అది కూడా సీఎం సహాయ నిధి నుంచి. వరదలప్పుడు కూడా రూ.కోటి సాయం అన్నారు తప్ప… అది ముఖ్యమంత్రి సహాయ నిధికి చేరలేదు.

Also Read : ఏపీలో రేపు ఏం జరగబోతోంది..?

కార్పొరేట్ దిగ్గజాలు మొదలు సామాన్యుల వరకు అంతా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికే అందించారు. కానీ వైఎస్ జగన్ మాత్రం ప్రకటించారు తప్ప… సాయం ఊసే లేదు. ఇప్పుడు కూడా అత్యాచారానికి, దాడులకు గురైన వారిని, వారి కుటుంబాలను జగన్ పరామర్శిస్తున్నాడు. అయితే ఆ సమయంలో కనీసం ఎలాంటి సాయం అందించలేదు. పైగా బాధితుల దగ్గరకు వెళ్లి ప్రభుత్వ హామీలు అమలు కావటం లేదు, ప్రభుత్వం విఫలమైంది అంటూ రాజకీయాలు మాట్లాడుతున్నారు. వినుకొండలో హత్యకు గురైన రఫీ కుటుంబాన్ని పరామర్శించినప్పుడు కూటమి సర్కార్ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల గురించి ప్రస్తావించారు.

తాజాగా గుంటూరులో సహాన కుటుంబాన్ని పరామర్శించిన సమయంలో కూడా మరోసారి కులం కార్డు తీశారు తప్ప… ఆర్థిక, న్యాయ సహాయంపై ఎలాంటి భరోసా ఇవ్వలేదు. దీంతో నెటిజన్లు వైసీపీ అధినేతను ఆడుకుంటున్నారు. బాధితులకు తొలి నుంచి టీడీపీ అండగా ఉందని… వరద బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున భువనేశ్వరి సాయం అందించారని… అలాగే వైసీపీ మూకల చేతుల్లో దాడికి గురైన వారికి టీడీపీ తరఫున న్యాయ సహాయం అందించారని గుర్తు చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్