Friday, September 12, 2025 09:04 PM
Friday, September 12, 2025 09:04 PM
roots

ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టుకి ఆ ఇద్దరు పేసర్లే దిక్కా?

ప్రపంచంలోని ఏ క్రికెట్ జట్టుకి అయినా ఆస్ట్రేలియా పర్యటన అంటే.. అంత ఈజీ కాదు, 140 కిలోమీటర్ల వేగంతో భారత్ లో బంతి దూసుకు రావడం వేరు, ఆస్ట్రేలియా పిచ్ ల మీద దూసుకురావడం వేరు. దానికి తోడు ఆస్ట్రేలియాకు బలమైన బౌలింగ్ లైనప్ ఉంది. ఆ లైనప్ తో ప్రపంచంలో ఏ జట్టుకు అయినా చుక్కలు చూపించే సత్తా ఆస్ట్రేలియా సొంతం. మరి మన బౌలింగ్ లైనప్…? ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఉప ఖండం పిచ్ ల మీద బంతిని గిర గిరా తిప్పవచ్చు గాని, స్వింగ్ చేయడం అనేది చాలా కష్టం. ఇది బౌలర్లకు ప్రధాన సమస్య.

దానికి తోడు బోర్డ్ కూడా స్పిన్ బౌలింగ్ మీదనే ఎక్కువగా ఫోకస్ చేసి పిచ్ లు తయారు చేస్తోంది. దీనితో ఫాస్ట్ బౌలర్లు రిథం కోల్పోతున్నారు. న్యూజిలాండ్ తో జరిగిన మొదటి టెస్ట్ లో ఈ విషయం క్లియర్ గా అర్ధమైంది. బూమ్రా కూడా బెంగళూరు పిచ్ పై ఫెయిల్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్ లో కాస్త ప్రభావం చూపించినా పరుగులు ఇచ్చేసాడు. ఇక సిరాజ్ గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరమే. 13 టెస్ట్ ల్లో 19 వికెట్లు తీసాడు. అంటే అతని ఫాం ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. బ్యాటింగ్ లో కూడా అతని ప్రభావం ఏం కనపడలేదు.

Also Read : ఆస్ట్రేలియా సీరీస్‌కు ఆ నలుగురు.. తెలుగోడిపై గంభీర్ విశ్వాసం

న్యూజిలాండ్ తో సీరీస్ కు అతన్ని పక్కన పెట్టాలని, బీ టీంతో అతన్ని వాడుకోవాలని సలహా ఇస్తున్నారు. ఆకాష్ దీప్ కు అవకాశాలు ఇవ్వాలని చెప్తున్నా… జట్టు యాజమాన్యం మాతం ఛాన్స్ లు ఇవ్వడం లేదు. ఇక టెస్ట్ జట్టులో అర్షదీప్ సింగ్ ను ప్రయోగించాలని అతన్ని తీసుకుంటే ఆస్ట్రేలియా పిచ్ ల్లపై లెఫ్ట్ హ్యాండర్ ప్రభావం ఉంటుందని పలువురు సలహా ఇస్తున్నారు. సీనియర్ బౌలర్ షమీ ఆస్ట్రేలియా టూర్ కు ఎంత వరకు వస్తాడో తెలియదు. ఖచ్చితంగా నలుగురు పేసర్లు టీంలో ఉండాల్సి ఉంది. బూమ్రా, షమి మినహా ఇప్పుడు టీంకు కీలక బౌలర్లు కనపడటం లేదు. దీనిపై సెలెక్షన్ కమిటీ ఫోకస్ పెట్టకపోతే మాత్రం ఆస్ట్రేలియా బ్యాటర్లు ఓ ఆట ఆడుకుంటారు అంటున్నారు క్రికెట్ పండితులు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్