టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి నట సింహం బాలకృష్ణ హోస్ట్ గా నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 4 చాలా గ్రాండ్ గా మొదలయింది. ఈ షో విషయంలో ఆహా యాజమాన్యం ఈసారి పక్కా లెక్కలతో ఉన్నట్టు తెలుస్తోంది. సీజన్ 3 అంతగా ఆకట్టుకోలేదు. కాని సీజన్ 4 విషయంలో మాత్రం పక్కాగా ఉండాలని ప్లాన్ చేసారు అల్లు అరవింద్. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక ట్రైలర్ కూడా లాంచ్ చేసారు. ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే షూట్ లో కూడా పాల్గొన్నారు. ఆదివారం ఈ ఎపిసోడ్ షూట్ కూడా పూర్తి చేసుకున్నారు.
దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే సీజన్ 4 మాత్రం ఎక్కువగా రాజకీయ నాయకులతోనే ఉండే ఛాన్స్ ఉందని సమాచారం. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సహా పలువురు ఏపీ మంత్రులు కూడా ఈ షోలో పాల్గొంటారు అని సమాచారం. ఏపీ ఆర్ధిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్, జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు ఈ షోకి రానున్నారు. అలాగే… తెలంగాణా సిఎం రేవంత్ రెడ్డి, పలువురు తెలంగాణా మంత్రులు కూడా హాజరు కానున్నారు.
Also read : ఏం వారసులు రా నాయనా…!
రాజకీయాలకు అతీతంగా ఈ సీజన్ 4 ఉంటుందని సమాచారం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్, హరీష్ రావు ఇద్దరినీ ఆహ్వానిస్తున్నారు. దీనికి సంబంధించి వాళ్ళతో ఇప్పటికే ఆహా టీం చర్చలు కూడా పూర్తి చేసింది. అలాగే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, నందమూరి సుహాసిని కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈసారి చిరంజీవి, రామ్ చరణ్ ను కూడా ఆహ్వానించే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. దీని ద్వారా మెగా ఫ్యామిలీలో విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని అల్లు అరవింద్ కూడా భావిస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.