ఏం వారసులు రా నాయనా… అనే మాట ఇప్పుడు ఏపీలో బాగా వినిపిస్తోంది. వైసీపీ నేతలకు సరైన వారసులు దొరికారనే మాట బలంగా వినిపిస్తోంది. పార్టీ అధినేతకు తగినట్లుగా ప్రతి నేత వారసుడు కూడా కేసులో ఉన్నారు. అదేమంటే… తప్పుడు కేసు అంటూ తాపీగా తప్పించుకునే జవాబిస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లు అడ్డగోలుగా చేసిన అక్రమాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఉత్తరాంధ్ర మొదలు… రాయలసీమ వరకు ఏ ప్రాంతమైనా సరే… వైసీపీ నేతల వారసుల అక్రమాలే కనిపిస్తున్నాయి.
ధర్మాన సోదరుల వారసులు ఇద్దరి పైనా ఇప్పటికే నాలుగు కేసులు నమోదయ్యాయి. ధర్మాన కృష్ణదాస్ కుమారుడి పైన దౌర్జన్యం కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక తమ్మినేని సీతారాం కొడుకు పైన అధికార దుర్వినియోగ ఆరోపణలున్నాయి. ఓ దళిత యువకుడిని మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడి హత్య చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఆయన కుమారుడిని మధురైలో అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఇక కారుమూరి నాగేశ్వర్రావు కుమారుడిపై ఎన్నికల్లో దౌర్జన్యంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అవకతవకలకు పాల్పడిన ఆరోపణలున్నాయి.
Also Read : నామినేటెడ్ జాబితా సిద్ధం… ఈసారి వారికే ప్రాధాన్యత…!
పేర్ని నాని వారసుడు పేర్ని కిట్టుపై ఇటీవలే మచిలీపట్నంలో దొమ్మి కేసు నమోదైంది. టీడీపీ నేతలపై దాడి చేయడంతో పాటు హత్యాయత్నం చేసినట్లు కిట్టూపై కేసు. ఇక అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడనే ఆరోపణలతో మరో మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడిపై ఏసీబీ కేసు నమోదు చేశారు. ఇక దేవినేని నెహ్రూ కుమారుడు దేవినేని అవినాష్ పైన లెక్కలేనన్ని. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై ఇటీవల దొమ్మి కేసు నమోదైంది. ఇక ఎమ్మెల్యే పులవర్తి నానిపైన హత్యాయత్నం చేసిన కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు నిందితుడు. ఇలా వైసీపీ ముఖ్య నేతల వారసులంతా… ఏదో ఒక కేసులో ఉండటంతో… ఏం వారసులు రా మీరంతా… అనే మాట బాగా వినిపిస్తోంది.