Friday, September 12, 2025 11:18 PM
Friday, September 12, 2025 11:18 PM
roots

అమరావతికి మోడీ..!

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పనులు గ్రాండ్ గా మొదలుపెట్టారు సీఎం చంద్రబాబు. రెండు రోజుల క్రితం ప్రారంభమైన ఈ పనులు త్వరలోనే వేగం అందుకోనున్నాయి. ఇక అమరావతి విషయంలో కేంద్రం నుంచి కూడా సహకారం పూర్తి స్థాయిలో ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీకి కేంద్రం నుంచి సపోర్ట్ ఉండటం కాస్త కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. 2014 నుంచి 2019 వరకు అమరావతి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా కూడా సపోర్ట్ చేయలేదు అనేది స్పష్టంగా చెప్పవచ్చు.

గత బడ్జెట్ లో 15 వేల కోట్లు ఇవ్వడం, ఆ నిధుల విడుదలకు కేంద్రం సహకరించడం కాస్త సంచలనం అయింది. దీనిపై వచ్చిన విమర్శలకు కూడా కేంద్రమే స్వయంగా సమాధానం చెప్పడం చూసి కొందరు సైలెంట్ అయిపోయారు అనే చెప్పాలి. ఇదిలా ఉంటే ఇప్పుడు అమరావతిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కొన్ని కీలక భవనాలు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన భవనాలను శంకుస్థాపన చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. వీటి శంకుస్థాపన గ్రాండ్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

Read Also : వాళ్ళు తిట్టమంటేనే బూతులు తిట్టా.. ఒప్పుకున్నా బోరుగడ్డ

త్వరలోనే… ప్రధాని నరేంద్ర మోడీ ని ఆహ్వానించి సభను నిర్వహించాలని చంద్రబాబు భావిస్తున్నారు. మొన్న హర్యానా పర్యటనకు వెళ్ళిన సందర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు కూడా ఈ విషయం చెప్పారని, కేంద్ర పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో ప్రధాని పోలవరం పర్యటన కూడా ఉంటుందని సమాచారం. ప్రధానికి మొత్తం వివరించాలని చంద్రబాబు భావిస్తున్నారు. తానే స్వయంగా కొన్ని నివేదికలు కూడా ప్రధానికి చంద్రబాబు అందించే అవకాశం ఉంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్