Monday, October 27, 2025 10:40 PM
Monday, October 27, 2025 10:40 PM
roots

జగన్ కు మరో ముగ్గురు ఎమ్మెల్సీల షాక్

ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీకి ఇప్పుడు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. రాజకీయంగా బలంగా ఉన్నప్పుడు విపక్షాలను లేకుండా చేయాలని ప్రయత్నాలు తీవ్రంగా చేసిన జగన్ కు ఇప్పుడు కూటమి నుంచి ఊహించని దెబ్బలు తగులుతున్నాయి. కూటమిలోని పార్టీల్లోకి పలువురు నేతలు వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. ఇన్నాళ్ళు మౌనంగా ఉన్న నేతలు ఇప్పుడు తమ రాజకీయ భవిష్యత్తు వెతుక్కుంటూ పార్టీ మారేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే రాజ్యసభ ఎంపీలు జగన్ కు గుడ్ బై చెప్పారు.

ముగ్గురు ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేసి సైలెంట్ అయ్యారు. ఇక ఇప్పుడు మరో ముగ్గురు ఎమ్మెల్సీలు కూడా రాజీనామాలు చేసేందుకు సిద్దమవుతున్నారు. ఒకప్పుడు ఎమ్మెల్సీలుగా తమ ప్రభావం జిల్లాల్లో చూపించిన ముగ్గురు నేతలు ఇప్పుడు జనసేనలో జాయిన్ అయ్యేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇందులో ఒక మహిళా ఎమ్మెల్సీ కూడా ఉన్నారు. పార్టీ ఓటమి తర్వాత కేసుల భయం వెంటాడటంతో వాళ్ళు బయటకు వచ్చే ప్రయత్నం చేయడం లేదు.

Also read : లోకేష్ బయటకు రావాల్సిందేనా…?

ఇప్పుడు ఒత్తిడి కూడా తెలియకుండానే ఎక్కువ కావడంతో బయటకు వచ్చేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఒక యువ నేత కూడా ఇప్పుడు జనసేన తీర్ధం పుచ్చుకోవడానికి సిద్దమవుతున్నట్టుగా తెలుస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చెలరేగిపోయిన సదరు ఎమ్మెల్సీ ఇటీవల పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు కూడా సిద్దమయ్యారని టాక్ నడుస్తోంది. అయితే వారికి జగన్ నుంచి హామీ వచ్చినా ఉండటానికి మాత్రం ఆసక్తి చూపడం లేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్