Saturday, September 13, 2025 01:11 AM
Saturday, September 13, 2025 01:11 AM
roots

ఆలపాటి గెలుపు సులువేనా..?

కృష్ణ, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి. ఇందుకు ప్రధాన కారణం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగనున్న తొలి ఎన్నికలు. అలాగే రెండు జిల్లాల పరిధిలోని కూటమి నేతల తీరు కూడా ఇంచుమించు ఇలానే ఉంది. కూటమి తరఫున అభ్యర్థిగా టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజా పేరును చంద్రబాబు ప్రకటించారు. తెనాలి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన రాజాను బుజ్జగించిన చంద్రబాబు ఆ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. తెనాలిలో గెలిచిన నాదెండ్ల మనోహర్ కు మంత్రివర్గంలో చోటు దక్కింది.

గుంటూరు జిల్లా పరిధిలో సీనియర్లు అందరూ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. కన్నా లక్ష్మీనారాయణ, దూళిపాళ్ల నరేంద్ర, పత్తిపాటి పుల్లారావు, జీవీ ఆంజనేయులు, యరపతినేని శ్రీనివాస్ లు సీనియర్లు. ఇక కృష్ణా జిల్లా పరిధిలో కూడా గద్దె రామ్మోహన్, శ్రీరాం తాతయ్య, తంగిరాల సౌమ్య ఉన్నారు. వీళ్లతో పాటు దేవినేని ఉమ, రావి వెంకటేశ్వరరావులకు టికెట్ రాకపోవడంతో ఎమ్మెల్సీ పదవి కోసం వెయిటింగ్. వీళ్లంతా రాజా గెలిస్తే తమకు పోటీ వస్తాడేమో అని భయపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా వైసీపీ నుంచి జనసేనలో చేరిన సామినేని ఉదయభాను కూడా ఎమ్మెల్సీ టికెట్ కావాలని అడుగుతున్నారు.

Also read : రెడ్‌ బుక్‌ కౌంటర్‌గా గుడ్‌ బుక్‌… జగన్ ప్లాన్ వర్కవుట్‌ అవుతుందా..?

ఓ వైపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగనున్న తొలి ఎన్నికలు, మరో వైపు నేతల మధ్య ఆధిపత్య పోరు… ఈ పరిస్థితుల్లో రాజా గెలుపు టీడీపీ అధినేతకు సవాల్ గా మారింది. ఏ కారణం చేతనైనా ఆలపాటి రాజా ఓడితే… దానిని వైసీపీ నేతలు తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం పై వ్యతిరేకంతోనే గ్రాడ్యుయేట్లు ఓడించారనే ప్రచారం చేస్తారనేది టీడీపీ భావన. అందుకే ఈ ఎన్నికపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్