Friday, September 12, 2025 08:57 PM
Friday, September 12, 2025 08:57 PM
roots

భగవంత్ కేసరి రీమేక్ చేయాలంటున్న తమిళ స్టార్ హీరో

తెలుగు సినిమాలు నచ్చితే తమిళంలో రీమేక్ చేయడానికి ఏ మాత్రం ఆలస్యం చేయడం లేదు అక్కడి హీరోలు. మన తెలుగు కథలపై అక్కడ ఉన్న నమ్మకమో మరో కారణమో తెలియదు గాని రీమేక్ సినిమాలు ఎక్కువగానే వస్తున్నాయి. తెలుగులో మార్కెట్ పెంచుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అక్కడి స్టార్ హీరోలు. ఇప్పుడు తమిళ స్టార్ హీరో విజయ్ మనసు మార్చుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవల సినిమాలు చేయను అని రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ ఇప్పుడు మళ్ళీ సినిమాల మీద ఆసక్తి చూపిస్తున్నట్టు టాక్.

Read Also : అప్పుడు పొగిడారు… ఇప్పుడు ఏమయ్యారు…?

ఇటీవల ఆయన హీరోగ్గా వచ్చిన GOAT సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. రాజకీయాల్లో కూడా అనువైన వాతావరణం విజయ్ కి కనపడటం లేదు. దీనితో రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. ఒక సినిమాకు ఇప్పటికే కథ రెడీ కాగా.. మరో సినిమా భగవంత్ కేసరి అని వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణ హీరోగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. బాలకృష్ణ నటనకు, లుక్ కి మంచి మార్కులు పడ్డాయి. వయసుకు తగ్గ సినిమాలు చేస్తున్న బాలయ్య ఈ సినిమాలో తన వయసుకి తగ్గ పాత్రే చేసారు.

ఇప్పుడు ఈ సినిమాను విజయ్ రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మలయాళ హీరోయిన్ మమితా బైజు… శ్రీలీల పాత్రలో కనపడే అవకాశం ఉంది. అయితే అనీల్ రావిపూడినే అక్కడ ఈ సినిమా చేయమని అడిగే అవకాశం ఉందని టాక్. ఈ సినిమా టైటిల్ కూడా భగవంత్ నాయర్ అని పెట్టె అవకాశం ఉందని సినీ వర్గాలు అంటున్నాయి. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కించే అవకాశం ఉంది. తమిళ నేటివిటి మిస్ కాకుండా ఈ సినిమాను ప్లాన్ చేయాలని చూస్తున్నారట.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్