వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి బెంగళూరు ప్యాలెస్ కు వెళ్ళారు. అధికారం కోల్పోయిన తర్వాత ఆయన బెంగళూరు పర్యటనకు వెళ్ళడం ఇది 13వ సారి కావడం విశేషం. శుక్రవారం సాయంత్రం ఆయన బెంగళూరు వెళ్ళడం.. ఆ తర్వాత మంగళవారం ఉదయం బెంగళూరు నుంచి తాడేపల్లి రావడం చేస్తున్నారు జగన్. సాఫ్ట్ వేర్ ఉద్యోగుల మాదిరి జగన్ వ్యవహరించడం చూసి అందరూ షాక్ అవుతున్నారు. వారంలో మూడు రోజులే పని దినాలు, మిగిలిన రోజులు వర్క్ ఫ్రం హోం అన్నట్టుగా ఉంది జగన్ వైఖరి.
అయితే ఆయన తాడేపల్లి వచ్చిన సమయంలో అసలు ఏం మాట్లాడటం లేదట. తాను ఏం చెప్పాలనుకున్నానో అదే చెప్పి వెళ్తున్నారట జగన్. నేతలతో మూడు గంటలు మాత్రమే ఆయన సమావేశాలు ఉంటాయట. ఏదైనా ప్రెస్ మీట్ లాంటిది ఉంటే సాక్షి విలేఖరికి చెప్తారట. సాక్షి బృందమే అక్కడ కూర్చుంటుంది. వాళ్ళ ప్రశ్నలు వినపడకుండా, జగనే హావభావాలు ఇస్తూ తల అటు ఇటు తిప్పుతూ చేతులు తిప్పుతూ మాట్లాడుతున్నారు. కరోనా సమయంలో.. ప్రజలను ఉద్దేశించి జగన్ ప్రసంగం అని ఒక వార్త వచ్చింది.
Read Also : కాళ్ళ బేరానికి గనుల వెంకట రెడ్డి
ఇప్పుడు కూడా జగన్ అదే చేస్తున్నారు. గణతంత్ర దినోత్సవం రోజు, స్వతంత్ర దినోత్సవం రోజుల్లో జాతిని ఉద్దేశించి ప్రధాని, రాష్ట్రపతి ప్రసంగం అన్నట్టే ప్రతిపక్షంలో కూడా ఉంది జగన్ వైఖరి. ఇక నాయకులు ఏదైనా కీలక విషయాల గురించి మాట్లాడుతుంటే జగన్ ఇక్కడేం వద్దు బెంగళూరు రండి అని చెప్తున్నారట. లేదంటే తనకు మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఒక లేఖ రాసి ఇవ్వమని ఆదేశించారట. ఈ లేఖలు అన్నీ ఓ వ్యక్తికి ఇవ్వమని చెప్పారట. మరి అది భయమో… సమాచారం బయటకు పోక్కుతుంది అనే ఆందోళన అర్ధం కాక నేతలు కూడా అయోమయంలో ఉన్నారట.