Friday, September 12, 2025 10:56 PM
Friday, September 12, 2025 10:56 PM
roots

బాలినేని ఎఫెక్ట్ మామూలుగా లేదుగా….!

ప్రకాశం జిల్లాలో వైసీపీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. వాస్తవానికి 2024 ఎన్నికల్లో వైసీపీ పరువు కాపాడిన జిల్లాల్లో ప్రకాశం జిల్లా కూడా ఒకటి. శ్రీకాకుళం, విజయనగరం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో వైసీపీ కనీసం బోణీ కూడా కొట్టలేదు. కడప, కర్నూలు, చిత్తూరు, విశాఖ జిల్లాల్లోనే వైసీపీకి సీట్లు వచ్చాయి. కూటమి హవాలో కూడా ప్రకాశం జిల్లాలో యర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు గెలిచారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పార్టీని ముందుండి నడిపించే నేత కరువయ్యాడనేది వాస్తవం.

సరిగ్గా మూడు నెలలు కూడా కాకముందే జగన్ సమీప బంధువు బాలినేని శ్రీనివాసులురెడ్డి వైసీపికి గుడ్ బై చెప్పేశారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ పోతుల సునీత, ఒంగోలు మేయర్, కార్పొరేటర్లు, పారిశ్రామిక వేత్తలు కూడా జగన్‌కు గుడ్ బై చెప్పేశారు. బాలినేని జనసేనలో చేరికను ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ వ్యతిరేకిస్తున్నప్పటికీ మిగిలిన వారెవరు కనీసం దామచర్లకు మద్దతు ఇవ్వటం లేదు. ఇదే తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు బాలినేని. జనసేనలో చేరిన తర్వాత ఇప్పటి వరకు జిల్లాకు బాలినేని రాలేదు. అయినప్పటికీ… జిల్లాలో వైసీపీకి ఊహించని రీతిలో దెబ్బ కొట్టేందుకు పావులు కదుపుతున్నారు.

Read Also : పెద్దాయన చుట్టూ బిగుస్తున్న ఉచ్చు…!

జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత కరణం బలరాంతో పాటు ఆయన కుమారుడు కరణం వెంకటేష్‌ కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. వాస్తవానికి 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున చీరాల నుంచి గెలిచిన కరణం బలరాం.. ఆ తర్వాత వైసీపీకి మద్దతు తెలిపారు. అయితే అద్దంకి నుంచే పోటీ చేసేందుకు సుముఖత చూపినప్పటికీ… జగన్ మాత్రం చీరాల టికెట్ కేటాయించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోటీ చేసి మరోసారి ఓడారు కరణం వెంకటేష్. ఫలితాల మరుసటి రోజు నుంచి కూడా కరణం టీమ్ చీరాలలో కనిపించటం లేదు. వీరు కూడా జనసేనలో చేరుతారనే ప్రచారం జోరుగా నడుస్తోంది. దీని వెనుక బాలినేని మంత్రాంగం ఉందనే మాట వినిపిస్తోంది. వాస్తవానికి ఇప్పటికే ప్రకాశం జిల్లా వైసీపీలో బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి మినహా మిగిలిన వారంతా సైలెంట్‌గానే ఉన్నారు. కరణం కూడా పార్టీ మారితే… జిల్లాలో వైసీపీకి కోలుకోలేని దెబ్బ ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్