Saturday, September 13, 2025 04:43 PM
Saturday, September 13, 2025 04:43 PM
roots

బయటపడ్డ జగన్నాటకాలు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుమల పర్యటన విషయంలో ఇప్పుడు పెద్ద దుమారమే రేగుతోంది. జగన్ తిరుమల పర్యటనకు వెళ్ళే అవకాశం ఉందని ముందు నుంచి అందరూ భావించారు. జగన్ కాలి నడకన తిరుమల వెళ్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇక తలనీలాలు కూడా ఆయన సమర్పించే అవకాశం ఉందని, డిక్లరేషన్ పై సంతకం కూడా జగన్ చేసే అవకాశం ఉందని కథనాలు వచ్చాయి. తీరా చూస్తే జగన్ అసలు తిరుమల పర్యటనకు వెళ్ళలేదు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొత్త విషయాలను చెప్పే ప్రయత్నం చేసి తుస్సుమనిపించారు.

డిక్లరేషన్ పై జగన్ సంతకం చేయాల్సి వస్తుందనే తిరుమల పర్యటనకు వెళ్ళలేదు అనే విషయంపై క్లారిటీ ఉంది. ఆయన తిరుమల వెళ్తారని తెలిసినప్పటి నుంచి అధికార కూటమి నేతలు, ఇతర హిందూ సంఘాలు అన్నీ కూడా జగన్ సంతకం చేసి తిరుమలలో అడుగు పెట్టాల్సిందే అని డిమాండ్ చేసాయి. గతంలో ఉన్న ఆచారమే కొనసాగించాలి అని డిమాండ్ లు చేసారు. కాని జగన్ తిరుమల వెళ్ళకుండా తనను చంపాలని చూసారు, దాడి చేయాలని చూసారు, నా మతం మానవత్వం అంటూ ఏవో చెప్పుకొచ్చే ప్రయత్నం చేసి డ్రామా రక్తి కట్టించాలని చూశారు.

Read Also : ప్రజల్లో నవ్వులపాలైన జగన్ బంట్రోతులు

రాజకీయ నాయకులు రాజకీయం చేయవచ్చు.. కానీ కొన్ని విషయాల్లో అన్నీ ఫాలో కావాల్సిందే. అబ్దుల్ కలాం కంటే, సోనియా గాంధీ కంటే జగన్ పెద్ద వ్యక్తి కాదు కదా…? తిరుమలలో అన్యమతస్థులు ఎవరు అడుగు పెట్టినా సరే సంతకం చేసిన తర్వాతనే వెళ్తున్నారు. కాని జగన్ మాత్రం ఇప్పటివరకు సంతకం చేసిన పాపాన పోలేదు. అసలు సంతకం చేయడానికి ఇష్టపడటం లేదు. అయితే జగన్ కు భార్య నుంచి ఒత్తిడి ఉందని సంతకం చేయాలని చూసినా… భారతి నుంచి ఆగ్రహం వ్యక్తం కావడం కొన్ని మత సంస్థలు ఆయనను వద్దని చెప్పే ప్రయత్నం చేయడంతోనే జగన్ ఆగిపోయారని వార్తలు వస్తున్నాయి. ముందు తిరుమల వెళ్లి అక్కడి నుంచి బెంగళూరు వెళ్లాలని చూసిన జగన్ భార్య ఒత్తిడి తోనే ఆగిపోయి పలు రకాల కథలు చెప్పారనే విమర్శలు వస్తున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

రేవంత్, కేటీఆర్ కు...

సాధారణంగా రాజకీయాల్లో వచ్చిన అవకాశాలను వాడుకోవడానికి...

కేటీఆర్ కు రేవంత్...

భారత రాష్ట్ర సమితి విషయంలో ముఖ్యమంత్రి...

జగన్ పరువును వారే...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే.....

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

పోల్స్