Saturday, September 13, 2025 04:45 PM
Saturday, September 13, 2025 04:45 PM
roots

ప్రజల్లో నవ్వులపాలైన జగన్ బంట్రోతులు

తిరుమల లడ్డు విషయంలో వైసీపీ ఇప్పుడు ఎన్ని విధాలుగా ప్రచారం చేస్తున్నా జనాల్లోకి మాత్రం వెళ్ళాల్సింది వెళ్ళింది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతోంది. తిరుమల లడ్డు తిన్న చాలా మందికి ఈ విషయంలో ఓ క్లారిటీ ఉంది. లడ్డు గతంలో మాదిరిగా లేదని ఎండిపోయినట్టు ఉందని చాలా మంది విమర్శలు చేసారు. అన్న ప్రసాదం విషయంలో కూడా అప్పట్లో భక్తులు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇక లడ్డులో కల్తీ నెయ్యి వాడారని ముఖ్యమంత్రి చేసిన ఆరోపణల తర్వాత బయటకు వస్తున్న కొన్ని విషయాలు వైసీపీ రాజకీయ భవిష్యత్తుపై పడుతున్నాయి.

ఏం చేయాలో అర్ధం కాని జగన్ ఇప్పుడు తిరుమల వెళ్తున్నారు. వైసీపీలో మాస్ లీడర్లుగా పేరున్న కొడాలి నానీ పెర్ని నానీలతో జగన్ మాట్లాడించారు. వాళ్ళ పద్దతిలో వాళ్ళు మాట్లాడారు. అవి జగన్ ను కలిసిన తర్వాత మాట్లాడిన మాటలు మాత్రమే. లడ్డు తిన్నాం కాబట్టి వాస్తవం మాకు తెలుసు అని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. నానీలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడినంత మాత్రాన అవి నిజం అవుతాయా అంటూ ప్రశ్నిస్తున్నారు. తప్పు చేసింది అప్పటి ప్రభుత్వం అయితే నానీ ఎన్ని సార్లు గుండు కొట్టించుకుంటే జనాలకు ఉపయోగం ఏంటీ అని నిలదీస్తున్నారు.

Read Also :దేవర దెబ్బ… సోషల్ మీడియాలో నందమూరి వార్

కొడాలి నానీ గుండు కొట్టించుకున్నారు, చంద్రబాబు కొట్టించుకోలేదు అంత మాత్రాన భక్తి లేనట్టు కాదు కదా… తలనీలాలు ఇచ్చిన వాళ్ళే భక్తులు అయితే మరీ మిగిలిన వాళ్ళు తిరుమల వెళ్ళడం ఎందుకు అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇది వైసీపీకి ఏం అర్ధం కాని పరిస్థితి అని జాతీయ స్థాయిలో హిందువులు అందరూ ఈ విషయంలో సీరియస్ గా ఉండటంతో జగన్ ఏం చేయాలో తెలియక మధన పడుతున్నారు అంటూ వైసీపీ నేతలే అంటున్నారు. ఇప్పటికే మెజారిటీ హిందువుల్లో జగన్ పై నమ్మకం పోయింది. తిరుమలలో గతంలో జరిగిన వ్యవహారాలు ఇంకా ప్రజల ముందు ఉన్నాయి. కాబట్టి పాప పరిహారం ఏ రూపంలో చేయాలో వైసీపీనే ఆలోచించుకోవాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

రేవంత్, కేటీఆర్ కు...

సాధారణంగా రాజకీయాల్లో వచ్చిన అవకాశాలను వాడుకోవడానికి...

కేటీఆర్ కు రేవంత్...

భారత రాష్ట్ర సమితి విషయంలో ముఖ్యమంత్రి...

జగన్ పరువును వారే...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటే.....

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

పోల్స్