ఇటీవల వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు ఆర్ధిక సహాయం చేసింది. భారీ వర్షాలు, వరదలకు చనిపోయిన వారు 74 మంది. రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. భారీ వర్షాలకు చనిపోయిన పశువులు 1562 కాగా వాటికి పరిహారం అందించింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా మునిగిన ఇళ్లు 1,18,070 కాగా పరిహారం రూ.215 కోట్లు చెల్లించారు.
విజయవాడలో మొత్తం ముంపు నివాసాలు 78,558 గా గుర్తించారు. విజయవాడలో పూర్తిగా మునిగిన గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్లు 64,799 కాగా గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్లకు రూ. 25 వేల చొప్పున సాయం రూ. 161.99 కోట్లు సాయం అందించారు. విజయవాడలో ఒకటి, ఆపై అంతస్తులు 13759 ఇళ్లుగా గుర్తించారు. మొదటి ఆపై అంతస్తు వారికి రూ.10 వేల చొప్పన రూ.13.76 కోట్లు చెల్లించారు. చనిపోయిన వారికి, పశు సంపదకు పరిహారం రూ.6.83 కోట్లు చెల్లించారు. దెబ్బతిన్న 44402 ద్విచక్రవాహనాలకు రూ.3 వేల చొప్పున పరిహారం రూ.13.32 కోట్లు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం.
Read Also : టిడిపి ప్రభుత్వంలో వైసీపీ పెత్తనం.. ఇదెక్కడి చోద్యం?
దెబ్బతిన్న 4348 ఆటోలకు రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం రూ.4.34 కోట్లు చెల్లించారు. దెబ్బతిన్న 1243 తోపుడు బండ్లకు రూ.20 చొప్పున రూ. 2.48 కోట్లు చెల్లించారు. దెబ్బతిన్న 5,181 కిరాణా షాపులు, హోటల్స్ రూ. 25 వేల చొప్పున పరిహారం రూ.12.97 కోట్లు చెల్లించారు. దెబ్బతిన్న 2500 చిన్నతరహా పరిశ్రమలకు రూ. 50 వేల చొప్పున రూ. 12.50 కోట్లు చెల్లించింది ప్రభుత్వం. దెబ్బతిన్న 469 పరిశ్రమలకు రూ. లక్ష చొప్పున రూ. 4.69 కోట్లు ఇచ్చారు. దెబ్బతిన్న 197 పెద్ద పరిశ్రమలకు రూ.1.50 లక్షల చొప్పున రూ. 2.95 కోట్లు అందించారు.
మొత్తం దెబ్బతిన్న 8347 పరిశ్రమలకు పరిహారం రూ.33.97 కోట్లు ఇచ్చింది ప్రభుత్వం. పంటనష్టం వివరాలు చూస్తే మొత్తం 1,12,345 హెక్టార్లతో 22 రకాల వ్యవసాయ పంటలకు పరిహారం రూ. 278 కోట్లు చెల్లించింది ప్రభుత్వం. మొత్తం 9236 హెక్టార్లలో హార్టికల్చర్ పంటలకు నష్ట పరిహారం రూ. 32.67 కోట్లు చెల్లించారు. ఇప్పటివరకు ఇంత తొందరగా, ఇంత పకడ్బందీగా అమలుచేసిన సాయం రాష్ట్ర చరిత్రలో లేదు. దీన్ని రికార్డు సమయంలో ఇచ్చినట్లు చెప్పొచ్చు.