Saturday, September 13, 2025 07:42 AM
Saturday, September 13, 2025 07:42 AM
roots

ఏపీ చరిత్రలో ఇదే మొదటిసారి.. అసలేం జరిగింది?

ఆంధ్రప్రదేశ్ లో వరదలు ఏమో గాని.. ఆంధ్రప్రదేశ్ పై కేంద్ర ప్రభుత్వం మాత్రం స్పెషల్ ఫోకస్ పెట్టడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. వరదలు వచ్చిన దగ్గరి నుంచి ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం ప్రత్యేక శ్రద్ద తీసుకుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. వరదలు వచ్చిన రోజు సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. కేంద్ర హోం మంత్రితో మాట్లాడిన వెంటనే హెలికాప్టర్ లు, పడవలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగడం మొదలు… అన్ని విధాలుగా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున సహాయం లభిస్తోంది. నిన్న ఏకంగా కేంద్ర మంత్రులే ఆంధ్రప్రదేశ్ లో దిగారు.

వరద ముంచేసినా.. కరవు దెబ్బతీసినా.. నష్టం పరిశీలనకు కేంద్ర బృందాలు గతంలో ఎప్పుడో వచ్చి చూసి వెళ్ళేవి. సాయం ఎప్పటికో గాని విడుదల చేసేవారు కాదు. కానీ తాజాగా విజయవాడలో వరద పూర్తిగా తొలిగిపోలేదు. ముంపు సమస్య ఇంకా కాస్తో కూస్తో అలాగే ఉంది. ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో వరదనష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్రం నుంచి ప్రత్యేక బృంద సభ్యులు హుటాహుటిన ముంపు ప్రాంతాల్లో పర్యటన చేశారు. వారికి లోకేష్ నేతృత్వంలో ఇతర అధికారుల బృందం పరిస్థితిని అంచనా వేసేందుకు కావలసిన సహకారం అందిస్తూ, వరద నష్టం పై పూర్తి సమాచారం ఇచ్చారు. ఇలా జరగడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే తొలిసారి అంటున్నారు చరిత్ర తెలిసిన వాళ్లు.

Read Also : వరద బాధితులకు మంత్రి గొట్టిపాటి కోటి రూపాయల మేర ప్రత్యక్ష సాయం

సాధారణంగా ఇలాంటి విపత్తు సమయాల్లో రాష్ట్రం నుంచి ప్రాథమిక నివేదికలు అందాక… రెండు, మూడు వారాలకు కేంద్ర బృందాలు వస్తాయి. వాటి నివేదిక ఆధారంగా కేంద్రం నిధుల్ని విడుదల చేస్తుంది. విజయవాడను ఆదివారం వరద ముంచెత్తగా.. గురువారం కేంద్రమంత్రితో పాటు ప్రత్యేక బృందం వచ్చి పరిశీలించి వెళ్ళింది. చౌహాన్ ఏరియల్ సర్వే చేయడంతో పాటు పంటలనూ స్వయంగా పరిశీలించారు. దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్దకు పరిస్థితి చూశారు.

సీఎం చంద్రబాబు చొరవ తీసుకుని.. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్అకు పరిస్థితిని ఎప్పటికప్పుడు వివరించారు. బుధవారం కేంద్ర బృందాన్ని నియమిస్తూ ఉత్తర్వులు వచ్చేసాయి. నష్టంతో పాటు ఆనకట్ట నిర్వహణ, భద్రత తదితర అంశాలను పరిశీలించి సిఫార్సులు చేసే బాధ్యతనూ బృందానికి కేంద్రం ఇచ్చింది. ఇలా కేంద్రం ఏపీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ ఒక్క విషయం చాలు కేంద్ర బాబు మాటకి ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో తెలియటానికి. బాబు అడిగిన వెంటనే సహకారం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రజలు కృతఙ్ఞతలు తెలుపుతున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్