Friday, September 12, 2025 09:19 PM
Friday, September 12, 2025 09:19 PM
roots

అత్యంత వివాదాస్పద అధికారి లక్ష్యంగా విచారణ ముమ్మరం

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ అవినీతికి పాల్పడిన అధికారుల విషయంలో టిడిపి ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఇప్పుడు దీనిపై వరుస విచారణలు చేస్తోంది. తాజాగా గత ప్రభుత్వంలో అత్యంత వివాదాపసదంగా వ్యవహరించిన ఒక కీలక అధికారిని లక్ష్యంగా చేసుకుని విచారణ మొదలుపెట్టింది. సమాచార శాఖ మాజీ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి పై విచారణకు సిఎం ఆదేశాలు జారీ చేసారు. విజయ్ కుమార్ రెడ్డి చేసిన అక్రమాలపై విచారణ చేయాలని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ని చంద్రబాబు ఆదేశించారు. 1990 IIS బ్యాచ్ కి చెందిన విజయ్ కుమార్ రెడ్డి… 2019 జూన్ 11న కేంద్ర సర్వీసుల నుండి ఏపి కి డిప్యూటేషన్ పై వచ్చారు.

క్విట్ ప్రోకో, నెపోటీజం, అవినీతి, అక్రమాల పై విచారణ చేయాలని సిఎం ఆదేశాలు ఇచ్చారు. ఒక్క సాక్షి మీడియాకు నిబంధనలకు విరుద్ధంగా 400 కోట్లకు పైగా ప్రకటనలు ఇచ్చారు విజయ్ కుమార్ రెడ్డి. సాక్షి మీడియా మాజీ సిఎం జగన్ కు చెందినది కావడంతో భారీగా ప్రకటనలు నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చారని విజయ్ కుమార్ రెడ్డి పై ఆరోపణలు ఉన్నాయి. 2019 నుండి 2024 మార్చి వరకు ఆయన హయంలో ఇచ్చి మీడియా ప్రకటనల్లో అక్రమాలపై విచారణ చేయనుంది ప్రభుత్వం. మీడియా ప్రకటన లతో పాటు అక్రిడేషన్ల జారీ వంటి అంశాలపై విచారణ జరిగే అవకాశం ఉందని సత్యంత వివిశ్వసనీయ సమాచారం.

ఏపీ డిప్యూటేషన్ ముగియడంతో కలకత్తా లో పీఐబీ డైరెక్టర్ జనరల్ గా ఈ మధ్యనే జాయిన్ అయ్యారు విజయ్ కుమార్ రెడ్డి. దీనికి సంబంధించి మరికొందరు అధికారులను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంది. విజయ్ కుమార్ రెడ్డి చేసిన అక్రమాలపై గతంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినా జగన్ సర్కార్ పట్టించుకోలేదు సరికదా మరింత ఏకపక్షంగా వ్యవహరించింది. విజయ్ కుమార్ రెడ్డి… కొన్ని పత్రికలపై కక్ష సాధింపుగా వ్యవహరించారనే ఆరోపణలు కూడా వినిపించాయి. దీంతో ఈ విచారణలో ఇంకెంతమంది అధికారుల పాత్ర బయటకొస్తుందో అని ఆందోళనలో ఉన్నారు పలువురు సీనియర్లు. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో కొద్దిమంది సీనియర్ ఐఏఎస్ లేక ఐపీఎస్ అధికారుల అరెస్ట్ ఖాయమంటూ వార్తలు వస్తున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్