Saturday, September 13, 2025 06:43 AM
Saturday, September 13, 2025 06:43 AM
roots

టిటిడిపి అధ్యక్షుడిగా కీలక వ్యక్తి ఫైనల్..?

తెలంగాణాలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు గత పదేళ్ళ నుంచి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. రాజకీయంగా ఓటుకు నోటు వ్యవహారం తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు మానసికంగా బలహీన పడ్డారు. ఇక కెసిఆర్ కు భయపడిన వాళ్ళు పార్టీ మారి నేటి భారాస లో చేరిపోయారు. ప్రస్తుతం తెలంగాణా తెలుగుదేశంలో ఇమేజ్ ఉన్న నేతలు చాలా తక్కువ మందే ఉన్నారు. వారిలో ఒక్కొక్కరు కాంగ్రెస్ లోకి వెళ్ళినా ఆశ్చర్యం లేదనే కామెంట్స్ బలంగా వినపడుతున్నాయి.

దీనితో చంద్రబాబు ఇప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను ఎవరికి అప్పగించాలి అనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. కీలక నేతలు చాలా మంది ఆ పదవి కోసం చూస్తున్నారు. తెరాస నుంచి ఒక నేత పార్టీ మారే అవకాశం ఉందని ఆయనకు ఆ పదవి ఆఫర్ చేసారని కూడా జనాల్లో టాక్ నడుస్తుంది. కానీ ఇప్పుడు వలస నేతలని నమ్మే పరిస్థితి పార్టీలో లేదన్న ప్రచారం జరుగుతుంది. ఇక ఇప్పుడు వస్తున్న వార్తలు చూస్తే… టీడీపీలో ఉన్న నేతకే బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. సామాజిక న్యాయం విషయంలో ముందు ఉండే తెలుగుదేశం పార్టీ… కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది.

Also Read : తెలంగాణ టిడిపి పై బాబు సంచలన నిర్ణయం

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నన్నూరి నర్సిరెడ్డికి బాధ్యతలు అప్పగించి ఆయన సారధ్యంలో గ్రేటర్ ఎన్నికలకు, స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలో ఉన్నట్టుగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రత్యర్ధులకు గట్టిగా గుచ్చుకునేలా ఆయన సమాధానం చెప్పగలరు, దానికి తోడు మంచి వాగ్ధాటి ఉన్న నేతగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు మంచి పేరుంది. అందుకే ఇప్పుడు ఆయనకు ఆ బాధ్యత ఇచ్చే ఆలోచనలో ఉన్నారట. దీనిపై చంద్రబాబు మాట్లాడినప్పుడు నర్సిరెడ్డి సానుకూలంగానే స్పందించారు అని టాక్ నడుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్