ఏపిలో జగన్ సర్కారులో జరిగిన ఆర్ధిక విధ్వంసాలను ప్రజలకు వివరిస్తున్న టిడిపి నాయకత్వం పై వైసీపీ చేస్తున్న రాజకీయ ఆరోపణల పై టిడిపి నాయకత్వం విరుచుకుపడింది. దీని పై మంత్రి అచ్చన్నాయుడు జగన్ పై విరుచుకుపడ్డారు. జనం ఛీ కొట్టినా జగన్ మాత్రం తన ఛీటింగ్ బుద్ధి మార్చుకోలేదంటూ ఆయన దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ లో ఏదో జరిగిపోతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. గత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ను అరాచక ఆంధ్రప్రదేశ్ గా మార్చి రాష్ట్రంలో రక్తపుటేరులు పారించింది మీరు కాదా జగన్ రెడ్డి? అంటూ సూటిగా ప్రశ్నించారు.
హత్యా రాజకీయాలకు కేరాఫ్ వైసీపీ. ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజల మొదలుకొని, ప్రతిపక్ష నేతల వరకు వారిపై దాడులు, దౌర్జన్యాలు జరగని రోజు ఏదైనా ఉందా? పల్నాడులో తెలుగుదేశం పార్టీ కార్యకర్త తోట చంద్రయ్యను నడిరోడ్డుపై గొంతు కోసి చంపింది ఎవరు? ఆనాడు జగన్మోహన్ రెడ్డి కళ్లుమూసుకొని కూర్చున్నారా? అని అచ్చన్నాయుడు విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగానే ఉన్నాయని, జగన్ మానసిక పరిస్థితే బాగాలేదు. అధికారం పోయేసరికి ఏం చేయాలో అర్థంకాక కూటమి ప్రభుత్వంపై అబద్ధాలతో కుట్రలు పన్నుతున్నారు.
Also Read : జగన్ అప్పుల పై కేంద్ర సంస్థ సంచలన రిపోర్ట్
ల్యాండ్, శాండ్, వైన్, మైనింగ్ ముఠా పాలన నడిపింది మీరుకాదా జగన్ రెడ్డి? ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వంపై ఇప్పుడైనా తప్పుడు ప్రచారాలు మానుకో.. లేదంటే వచ్చే ఎన్నికల్లో మీరు ఎమ్మెల్యేగా కూడా గెలవలేరు. ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేసినా జగన్ లో ఎటువంటి మార్పు రాలేదు. జగన్ తప్పుడు ప్రచారాన్ని జనం నమ్మే పరిస్థితుల్లో లేరు. త్వరలో వైసీపీ కార్యాలయానికి టులెట్ బోర్డు పెట్టుకోవడం ఖాయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.