తెలుగు సినీ పరిశ్రమలో మెగా స్టార్ చిరంజీవి స్టామినా గురించి తెలియని వారు ఉండరు. అలాంటి మెగా ఫ్యామిలీలో విభేదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయా…? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. మెగా ఫ్యామిలీలో ముఖ్యంగా అల్లు అర్జున్ కు అలాగే కొణిదెల కుటుంబానికి మధ్య విభేదాలు తారా స్థాయిలో ఉన్నాయనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇటీవల ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ తనకి ఆప్తుడైన పవన్ కళ్యాణ్ కు ప్రచారం చేయకుండా నేరుగా వైసీపీ అభ్యర్ధికి స్నేహితుడు అనే పేరుతో ప్రచారం చేయడం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇక అతని సినిమా పుష్ప 2 కి సంబంధించి కూడా ఎన్నో వార్తలు వచ్చాయి.
పుష్ప 2 సినిమాను మెగా అభిమానులు బాయ్ కాట్ చేయవచ్చనే ప్రచారం కూడా జరుగుతుంది. ముందు నుంచి కూడా అల్లు అర్జున్… తన తండ్రి ఇమేజ్ తోనే సినిమాల్లో నిలబడ్డాను అనే భావనలో ఉంటారు. మెగా అభిమానులు ఆదరించినా సరే… అసలు చిరంజీవికి లైఫ్ ఇచ్చింది తన కుటుంబమే అనే భావనలో కూడా ఆయన ఉంటారట. అదే ఇప్పుడు విభేదాలను పెంచింది అన్న అభిప్రాయం సినీ పరిశ్రమలో వినిపిస్తుంది. ఇదిలా ఉంచితే ఇప్పుడు అల్లు అర్జున్ ను మెగా ఫ్యామిలిని కలిపే బాధ్యతను రాఘవేంద్ర రావు తీసుకున్నారని అంటున్నారు. ఆయన తన ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారని తెలుస్తుంది.
ఈ నేపధ్యంలోనే ఒక మల్టీ స్టారర్ సినిమాను ఆయన ప్లాన్ చేసారట. ఒక అగ్ర దర్శకుడితో ఆ సినిమాను తెరకెక్కించే బాధ్యతను ఆయన తీసుకున్నారని… అల్లు అర్జున్, అలాగే రామ్ చరణ్ హీరోగా ఆ సినిమాను ప్లాన్ చేయాలని ఆయన భావించారట. ఇక అందులో జూనియర్ ఎన్టీఆర్ కు కూడా ఒక పాత్ర ఇవ్వాలని ఆయన ప్లాన్ చేసి చెప్పారట. జూనియర్ ఎన్టీఆర్ గెస్ట్ రోల్ చేస్తారని ఆయన్ను కూడా ఒప్పించేందుకు సిద్దం అయ్యారట. ఎన్టీఆర్ కు అల్లు అర్జున్ కి, ఎన్టీఆర్ కు రామ్ చరణ్ కు మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. అందుకే ఆ విధంగా రావాలని చూసినా అల్లు అర్జున్ అసలు వినలేదని అంటున్నారు. ఒక అగ్ర నిర్మాత సైతం వీరి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా సినీ వర్గాలు అంటున్నాయి.




