Friday, November 20, 2026 09:07 PM
Friday, November 20, 2026 09:07 PM

కొత్త హోండా అవన్సియర్ ఎస్‌యూవీ రిలీజ్.. ప్రత్యేకతలు ఇవే..!

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హోండా తన సరికొత్త మూడు వరుసల హైబ్రిడ్ ఎస్‌యూవీ హోండా అవన్సియర్ ను ఆవిష్కరించింది. కంపెనీ రూపొందించిన నెక్స్ట్-జనరేషన్ హోండా హైబ్రిడ్ సిస్టమ్, డ్యూయల్‌పవర్ ఎలక్ట్రిక్ ఆల్-వీల్ డ్రైవ్ టెక్నాలజీతో వస్తున్న మొట్టమొదటి కారు ఇదే కావడం విశేషం. ‘గ్రాండ్-జర్నీ’ కాన్సెప్ట్‌తో సుదూర ప్రయాణాలకు అనువుగా, విశాలమైన క్యాబిన్‌తో దీనిని తీర్చిదిద్దారు. కొత్త ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించిన ఈ ఎస్‌యూవీపై సరికొత్త హోండా ‘H’ లోగోను పరిచయం చేశారు. ముందుగా థాయ్‌లాండ్, జపాన్, చైనా వంటి ఆసియా మార్కెట్లలో దీనిని విడుదల చేయనుండగా, భారత్‌లో విడుదలకు సంబంధించి కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Also Read : చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. సేనా దేశాల్లో అరుదైన రికార్డు..!

డిజైన్ పరంగా చూస్తే ప్రస్తుతం ఉన్న హోండా ఎస్‌యూవీలకు భిన్నంగా, చాలా ఆకర్షణీయమైన బాక్సీ లుక్‌తో అవన్సియర్ కనిపిస్తోంది. ముందు భాగంలో బోల్డ్ గ్రిల్, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్స్, బానెట్ కింద సన్నని డ్యూయల్-ఫంక్షన్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సైడ్ ప్రొఫైల్‌లో పెద్ద విండోలు, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, 20-అంగుళాల మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. వెనుక భాగంలో నిలువుగా ఉండే ఎల్‌ఈడీ టెయిల్-ల్యాంప్స్, రూఫ్ స్పాయిలర్ అమర్చారు. క్యాబిన్ లోపల 2-2-2 సీటింగ్ లేఅవుట్‌తో ఆరుగురు కూర్చునే వీలుంటుంది. ముఖ్యంగా రెండో వరుసలో లిమోసిన్ స్థాయి లగ్జరీ, సౌకర్యం ఉండేలా డిజైన్ చేశారు.

ఇంటీరియర్‌లో ఐస్-గ్రే, బ్లాక్ థీమ్‌తో పాటు ప్రీమియం ఫీచర్లను అందించారు. ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, డాల్బీ అట్మాస్‌తో కూడిన 12-స్పీకర్ల బోస్ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్ ఉన్నాయి. వీటితో పాటు వెంటిలేటెడ్ మరియు హీటెడ్ సీట్లు, మెమరీ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రిక్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, మూడు వరుసలకు ఏసీ వెంట్స్, లెవల్-2 అడాస్ వంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లు ఉన్నాయి. రిమోట్ ఇన్-క్యాబిన్ వ్యూ, సరౌండ్-వ్యూ కెమెరా సదుపాయాలు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి.

Also Read : బ్రేకింగ్: ఎమ్మెల్యే పదవికి ఆది నారాయణరెడ్డి రాజీనామా..?

ఇంజిన్ సామర్థ్యం విషయానికొస్తే, ఇందులోని 2.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌కు e-CVT ట్రాన్స్‌మిషన్, నెక్స్ట్-జెన్ హైబ్రిడ్ సిస్టమ్‌ను జతచేశారు. ఇందులోని ‘డ్యూయల్‌పవర్ eAWD’ వ్యవస్థలో ముందు, వెనుక యాక్సిల్స్‌ను వేర్వేరు ఎలక్ట్రిక్ మోటార్లు స్వతంత్రంగా నడిపిస్తాయి. దీనివల్ల వాహనం వేగంగా పికప్ అందుకోవడంతో పాటు, రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా మెరుగైన స్థిరత్వాన్ని అందిస్తుంది. అయితే ఈ ఎస్‌యూవీ పవర్, టార్క్, బ్యాటరీ సామర్థ్యం, మైలేజీ వివరాలను హోండా త్వరలోనే వెల్లడించనుంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఆంధ్రప్రదేశ్‌పై ఇతర రాష్ట్రాల...

IndiaStat, Projects Today గణాంకాల ప్రకారం,...

పేదింటి దళిత బిడ్డకు...

ఎన్టీఆర్ జిల్లా తొలి జిల్లా పరిషత్...

కాలుష్యానికి కారకులెవరు..?

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చాలా...

పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.....

వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో...

బ్రేకింగ్: ఎమ్మెల్యే పదవికి...

వైఎస్సార్ కడప జిల్లా పరిషత్ ఛైర్మన్...

తల్లయిన సమంత.. ముద్దుల...

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్...

పోల్స్