అమరావతి నిర్మాణాన్ని అడ్డుకునేందుకు వైసీపీ మరోసారి తన పాత కుట్రలకు పదును పెట్టింది. గత ఐదేళ్ల తమ పాలనలో మూడు రాజధానుల పేరుతో అమరావతిని నిర్వీర్యం చేసిన ఆ పార్టీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో రాజధాని పనులు శరవేగంగా సాగుతుంటే జీర్ణించుకోలేకపోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలను ఒప్పించి వేల కోట్ల రూపాయల నిధులను సమీకరిస్తుండటంతో, ఆ నిధుల ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు వైసీపీ తెరవెనుక కుతంత్రాలకు తెరలేపింది.
Also Read : భారత్‌లో అమెజాన్ భారీ ప్లానింగ్.. ఏపీపై స్పెషల్ ప్లానింగ్..!
గతంలో 2014-19 మధ్య కాలంలోనూ అమరావతికి నిధులు రాకుండా వైసీపీ నేతలు ఇదే తరహా కుట్రలకు పాల్పడ్డారు. అప్పట్లో ప్రపంచ బ్యాంక్‌కు తప్పుడు సమాచారంతో, నిరాధారమైన ఆరోపణలతో వరుస ఫిర్యాదులు చేసి రుణం మంజూరు కాకుండా అడ్డుకున్నారు. 2019లో అధికారంలోకి రాగానే కక్షపూరితంగా రాజధాని పనులను నిలిపివేసి, అంతర్జాతీయ సంస్థలను వెనక్కి పంపారు. ఇప్పుడు అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుని ప్రగతి పథంలో పరుగులు పెడుతుండటంతో, తమ రాజకీయ ఉనికి ప్రశ్నార్థకమవుతుందనే భయంతో వైసీపీ మళ్లీ అదే పాత ఎత్తుగడలను అమలు చేస్తోంది.
ప్రస్తుతం ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ ద్వారా అమరావతి నిర్మాణానికి భారీ ఎత్తున నిధులు అందుతుండటంతో, ఆ సంస్థలను తప్పుదోవ పట్టించేందుకు వైసీపీ నేతలు కొందరిని ఉసిగొల్పి తప్పుడు ఫిర్యాదులు చేయిస్తున్నారు. భూకేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని, నిబంధనలు ఉల్లంఘించారని కట్టుకథలు అల్లుతూ అంతర్జాతీయ సంస్థలకు లేఖలు రాయడం వెనుక వైసీపీ కుట్ర స్పష్టంగా కనిపిస్తోంది.
Also Read : వాహనదారులకు కేంద్ర రవాణాశాఖ షాకింగ్ న్యూస్..!
అయితే, వైసీపీ ఆడుతున్న ఈ నాటకాలను ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు పసిగట్టారు. గతంలోనూ వైసీపీ చేసిన ఫిర్యాదులపై విచారణ జరిపి అవి నిరాధారమైనవని తేల్చిన ప్రపంచ బ్యాంక్, ఇప్పుడు మళ్లీ అదే తరహా కుట్రపూరిత ఫిర్యాదులు రావడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర అభివృద్ధిని, ప్రజల భవిష్యత్తును పణంగా పెట్టి కేవలం రాజకీయ స్వార్థం కోసం అంతర్జాతీయ వేదికలపై అమరావతిని బదనాం చేస్తున్న వైసీపీ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


