Wednesday, November 18, 2026 12:38 PM
Wednesday, November 18, 2026 12:38 PM

జడ్పీ ఛైర్మన్ల సందడి.. కూటమి అగ్ర నేతల కీలక భేటీ..!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ తుది ఘట్టానికి చేరుకుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, నవంబర్ 19న రాష్ట్రంలోని 659 మండల పరిషత్‌లలో ఎంపీపీ ఎన్నికలు జరగనుండగా, నవంబర్ 20న 28 జిల్లా పరిషత్‌లలో ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం 28 జడ్పీ స్థానాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా మినహా మిగిలిన 27 స్థానాలు కూటమి ఖాతాలోకి చేరనున్నాయి. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అధికారులు ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేశారు.

Also Read : భారత్‌లో అమెజాన్ భారీ ప్లానింగ్.. ఏపీపై స్పెషల్ ప్లానింగ్..!

నవంబర్ 20వ తేదీన ఆయా జిల్లాల కలెక్టరేట్ సమావేశ మందిరాల్లో ఉదయం 10 గంటలలోపు ఇద్దరు కో-ఆప్టెడ్ సభ్యుల పదవులకు నామినేషన్లు స్వీకరిస్తారు. కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ పూర్తయిన తర్వాత, మధ్యాహ్నం 3 గంటలకు జడ్పీ ఛైర్‌పర్సన్ మరియు వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నికలను చేతులెత్తే పద్ధతిలో నిర్వహిస్తారు. ఈ ఎన్నికల్లో ఎక్స్-అఫీషియో సభ్యులైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కు ఉండదని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికకు ముందు రోజే ప్రిసైడింగ్ అధికారికి ఫారం-ఏ, ఫారం-బీలను సమర్పించాల్సి ఉంటుంది.

Also Read : భారత్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్ సంచలనం..!

మరోవైపు, 27 జడ్పీ ఛైర్మన్ పీఠాలను కైవసం చేసుకుంటున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక సీట్ల సర్దుబాటుపై కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ అగ్రనేతలు కసరత్తు ముమ్మరం చేశారు. నేడు కూటమి అగ్రనేతలు సమావేశమై స్థానాల సర్దుబాటుపై తుది చర్చలు జరపనున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో టీడీపీ, జనసేన మధ్య తీవ్ర పోటీ నెలకొనగా, కడప జడ్పీ పీఠాన్ని బీజేపీ ఆశిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కూటమి పార్టీల మధ్య స్థానాల సర్దుబాటుపై చర్చలు పూర్తయిన వెంటనే, ఈరోజు, రేపట్లో తుది అభ్యర్థుల జాబితాను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. పార్టీ విప్ జారీకి సంబంధించిన నమూనాలను కూడా ఎన్నికలకు ముందుగానే ప్రిసైడింగ్ అధికారులకు అందజేయాలని నిబంధనలు చెబుతున్నాయి. మొత్తానికి ఈ నెల 20న జరిగే జడ్పీ ఛైర్మన్ల ఎన్నికలతో రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థల పాలకవర్గాల ఏర్పాటు కొలిక్కి రానుంది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

వాహనదారులకు కేంద్ర రవాణాశాఖ...

దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు...

ఆ నలుగురే టీటీడీ...

తిరుమ తిరుపతి దేవస్థానం పాలకమండలి చైర్మన్...

నా కూతురి పెళ్లి...

తన కుమార్తె వివాహానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి...

ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన...

భారత క్రికెట్ చరిత్రలో, ముఖ్యంగా ఐపీఎల్...

విజయ డెయిరీలో ఏం...

కృష్ణా జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర...

జగన్ ఫేక్ ట్వీట్‌కు...

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశంపై...

పోల్స్