Tuesday, November 17, 2026 05:07 PM
Tuesday, November 17, 2026 05:07 PM

నా కూతురి పెళ్లి పిలుపులోనూ రాజకీయాలా.. సాక్షిపై షర్మిల ఫైర్!

తన కుమార్తె వివాహానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆహ్వానించడంపై సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని వైఎస్ షర్మిల తీవ్రంగా ఖండించారు. కుటుంబ వేడుకకు ఇచ్చిన ఆహ్వానానికి రాజకీయ అర్థాలు ఆపాదించారని విమర్శించారు. ఒక మహిళగా తన వ్యక్తిగత గౌరవాన్ని, కుటుంబ ప్రతిష్ఠను దెబ్బతీసేలా కథనం ఉందని ఆరోపించారు.

కుటుంబ వేడుకకు రాజకీయ రంగు ఎందుకు?

కుటుంబ శుభకార్యాలకు రాజకీయ నాయకులను ఆహ్వానించడం సాధారణమని షర్మిల అన్నారు. తన తండ్రి వయసున్న వ్యక్తికి వివాహ ఆహ్వాన పత్రిక అందజేస్తే, దాన్ని ‘చెట్టాపట్టాలు’గా చిత్రీకరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాజకీయ విభేదాలను వ్యక్తిగత జీవితాల్లోకి తీసుకురావడం సరికాదని పేర్కొన్నారు.

Also Read : ఇరాన్ వార్నింగ్ లైట్ తీసుకున్న అమెరికా.. చివరకు ఏమైంది..?

వైఎస్సార్ ఇచ్చిన ఆహ్వానాలను గుర్తుచేసిన షర్మిల

దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా తన పిల్లల వివాహాలకు చంద్రబాబు నాయుడిని ఆహ్వానించారని షర్మిల గుర్తుచేశారు. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ కుటుంబ వేడుకలకు ఒకరినొకరు ఆహ్వానించుకోవడం సహజమని అన్నారు. తన ఆహ్వానానికి రాజకీయ అర్థాలు ఆపాదిస్తున్నవారు, వైఎస్సార్ ఇచ్చిన ఆహ్వానాలను కూడా అదే కోణంలో చూస్తారా అని ప్రశ్నించారు.

జగన్, సాక్షి యాజమాన్యం స్పందించాలని డిమాండ్

మహిళలను గౌరవిస్తామని చెప్పే వైసీపీ నాయకత్వం ఈ కథనంపై ఏం చెబుతుందని షర్మిల ప్రశ్నించారు. తనపై వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా కథనం రాశారని ఆరోపించారు. ఒక మహిళ వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీసేలా కథనం ప్రచురించడం పత్రికా ధర్మమేనా అని నిలదీశారు. ఈ వ్యవహారంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు సాక్షి యాజమాన్యం కూడా స్పందించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన...

భారత క్రికెట్ చరిత్రలో, ముఖ్యంగా ఐపీఎల్...

విజయ డెయిరీలో ఏం...

కృష్ణా జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర...

జగన్ ఫేక్ ట్వీట్‌కు...

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశంపై...

మళ్ళీ మొదటికి వచ్చిన...

కృష్ణా జిల్లా మిల్క్ ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్...

ఎన్విడియా వివాదం వేళ...

అంతర్జాతీయ టెక్నాలజీ, చిప్‌సెట్ రంగాల్లో ప్రముఖ...

కోస్తాంధ్ర తీరాన్ని ఈనెల...

ఇప్పటికే 2 తుపాన్లతో అల్లాడుతున్న ఏపీ...

పోల్స్