Thursday, November 5, 2026 05:29 PM
Thursday, November 5, 2026 05:29 PM

తిరుమల లడ్డూ కల్తీ కేసుపై సుప్రీం సంచలన నిర్ణయం..!

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారానికి సంబంధించిన కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ వెలుపలికి బదిలీ చేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కేసు విచారణను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేసేందుకు ప్రస్తుత దశలో ఎలాంటి తగిన కారణాలు లేవని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మహారాష్ట్రకు చెందిన మల్గంగా మిల్క్ అండ్ ఆగ్రో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మశ్చీంద్ర శాంతారామ్ ఈ బదిలీ పిటిషన్‌ను దాఖలు చేశారు.

Also Read : విశాఖ జగన్ కు ఎందుకు కలగానే మిగిలిపోతోంది..?

విచారణ సందర్భంగా నిందితుడి తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనలు వినిపిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఈ వ్యవహారంపై తీవ్ర ప్రతికూల, రాజకీయ వాతావరణం నెలకొందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి నిరంతరం ఈ కేసుపై రాజకీయ ప్రకటనలు చేస్తున్నారని, దీనివల్ల నిష్పక్షపాతంగా విచారణ సాగడం కష్టమని, అందుకే కేసును ఏదైనా పొరుగు రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. ఈ వాదనలపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది.

Also Read : భారత దంపతులపై అమెరికా సంచలన ఆంక్షలు..!

“మా మునుపటి ఆదేశాలతో మేం ఇప్పటికే అందరినీ నిశ్శబ్దంగా ఉండేలా చేశాం. ఒకవేళ ఏమైనా అనుకోని పరిణామాలు జరిగితే, మీరు మళ్లీ మా వద్దకు రావచ్చు” అని ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేకాకుండా, కేసు విచారణ అనేది రాజకీయ నేతల ప్రకటనల ఆధారంగా కాకుండా పూర్తి సాక్ష్యాధారాల ప్రకారమే సాగుతుందని కోర్టు పేర్కొంది. ఈ కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు స్వయంగా ఏర్పాటు చేసిన స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందం పర్యవేక్షిస్తోందని ధర్మాసనం గుర్తుచేసింది. అంతేకాకుండా, ఈ కేసునకు సంబంధించిన మెజారిటీ సాక్షులు, కీలక ఆధారాలు అన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోనే ఉన్నందున, కేసును వేరే ప్రాంతానికి బదిలీ చేస్తే విచారణ ప్రక్రియకు ఆటంకం కలుగుతుందని కోర్టు అభిప్రాయపడింది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

ఇది కదా కావాల్సింది.....

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్...

విశాఖ జగన్ కు...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన...

రామాయణ పార్ట్1 రివ్యూ...

భారతీయులకు చిరపరిచితమైన రామాయణ గాథను భారీ...

ఏ ఎన్నిక జరిగినా...

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి...

ఆధారాలు ఇచ్చేస్తా.. ఈడీ...

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్...

యువగళం హామీ నిలబెట్టుకున్న...

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న...

పోల్స్