Thursday, November 5, 2026 01:51 PM
Thursday, November 5, 2026 01:51 PM

భారత దంపతులపై అమెరికా సంచలన ఆంక్షలు..!

ఇరాన్‌పై ఉన్న అంతర్జాతీయ చమురు ఆంక్షలను తప్పించుకోవడానికి సహాయం చేస్తున్నారనే ఆరోపణలతో చండీగఢ్‌కు చెందిన ఒక భారత దంపతులు, వారి వ్యాపార సంస్థలపై అమెరికా ప్రభుత్వం తీవ్రమైన ఆంక్షలు విధించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల తదుపరి మిడ్-టర్మ్ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే, డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం “ఆపరేషన్ ఎకనామిక్ అవుట్‌కాస్ట్” లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇరాన్ చమురు అమ్మకాల ద్వారా సైనిక చర్యలకు నిధులు సమకూర్చకుండా అడ్డుకోవడమే ఈ ఆంక్షల ముఖ్య ఉద్దేశమని అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది.

Also Read : ఎన్నికల్లో ట్రంప్ కు షాక్.. భారత్ కు ఎలా ప్లస్..?

ఈ వ్యవహారంలో చండీగఢ్‌కు చెందిన సునీల్ కుమార్ శర్మ, అతని భార్య జస్‌ప్రీత్ ప్రీతి షాహిద్ ప్రధాన సూత్రధారులుగా ఉన్నట్లు అమెరికా గుర్తించింది. వీరిద్దరూ గయానా, ఈస్వాతిని, లావోస్ వంటి దేశాలకు నకిలీ ప్రతినిధులుగా చెప్పుకుంటూ వెబ్‌సైట్లను సృష్టించారు. ఆయా దేశాల పేర్లతో నకిలీ మారిటైమ్ సర్టిఫికేషన్లు, ఫ్లాగ్‌లను అంటే నౌకల రిజిస్ట్రేషన్లు జారీ చేస్తూ ఇరాన్ మిలిటరీకి చెందిన షాడో ఫ్లీట్.. అంతర్జాతీయ నిబంధనలకు దొరకకుండా తిరిగేలా వీరు నెట్‌వర్క్ నడిపినట్లు దర్యాప్తులో తేలింది.

Also Read : ఆధారాలు ఇచ్చేస్తా.. ఈడీ ముందు అంబటి ఒప్పేసుకున్నారా..?

ఈ నకిలీ ధృవీకరణల వల్ల అంతర్జాతీయ భద్రతకు, పర్యావరణానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని అమెరికా పేర్కొంది. ఈ ఆంక్షలపై అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ స్పందిస్తూ అత్యంత తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. “ఈ ఆపరేషన్‌లో మీరు మా వైపైనా ఉండాలి లేదా మాకు వ్యతిరేకంగానైనా ఉండాలి. ఇరాన్ ప్రభుత్వానికి భూమి, ఆకాశం, సముద్ర మార్గాల్లో ఎవరు సహాయం చేసినా సరే.. వారు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని మరీ ఆంక్షలు విధిస్తాం” అని ఆయన సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. ఈ భారత జంటకు చెందిన 9 వ్యాపార సంస్థలతో పాటు, ఇరాన్ విమానయాన రంగానికి గ్రౌండ్ సర్వీసులు అందిస్తున్న టర్కీకి చెందిన ఫుగో గ్రౌండ్ సర్వీసెస్ సంస్థపై కూడా అమెరికా ఆంక్షల వేటు వేసింది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

విశాఖ జగన్ కు...

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన...

రామాయణ పార్ట్1 రివ్యూ...

భారతీయులకు చిరపరిచితమైన రామాయణ గాథను భారీ...

ఏ ఎన్నిక జరిగినా...

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి...

ఆధారాలు ఇచ్చేస్తా.. ఈడీ...

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్...

యువగళం హామీ నిలబెట్టుకున్న...

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న...

ఎన్నికల్లో ట్రంప్ కు...

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్...

పోల్స్