Thursday, November 5, 2026 01:14 PM
Thursday, November 5, 2026 01:14 PM

ఏ ఎన్నిక జరిగినా కూటమిదే విజయం.. అంబటి సంచలనం

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఎట్టకేలకు పొలిటికల్ రియాలిటీ అర్థమైందా.? అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులు, ప్రజల్లో వచ్చిన మార్పు ఆయనకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయా..? అంటే..అవుననే సమాధానమే వస్తోంది. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీశాయి. రాబోయే రోజుల్లో ఏపీలో ఏ ఎన్నికలు జరిగినా సరే కూటమిదే విజయమని, తమ పార్టీకి ఓటమే పునరావృతం అవుతుందని అంబటి చేసిన ఓపెన్ కామెంట్స్ వైఎస్సార్‌సీపీ కేడర్‌కు పెద్ద షాక్ ఇచ్చాయి.

Also Read : దీపావళి స్వీట్లలో ఆరోగ్య రహస్యం.. జీర్ణవ్యవస్థకు ఏది బెస్ట్..?

ఇటీవల ముగిసిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై విలేకర్లు ప్రశ్నించినప్పుడు అంబటి మాట్లాడిన తీరు, ఆ రాజకీయ పరిణతిని స్పష్టం చేస్తోంది. మా పార్టీ ఘోరంగా ఓడిపోయిందనేది పచ్చి నిజం అని ఆయన అంగీకరించారు. అంతటితో ఆగకుండా, గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా అక్రమాలకు పాల్పడ్డారు కదా..అని రిపోర్టర్లు నిలదీసిన క్షణంలో.. దాటవేత ధోరణి ప్రదర్శించకుండా అందుకే కదా ఇప్పుడు మాకు ఈ గతి పట్టింది అని సూటిగా బదులిచ్చారు. ఇది కేవలం రాజకీయం కాదు, రియాలిటీని ఒప్పుకోవడం!

ఒక సీనియర్ నాయకుడై ఉండి, సొంత పార్టీ వైఫల్యాలను, గత ప్రభుత్వ వైఖరిని ఈ స్థాయిలో అంగీకరించడం ఏపీ రాజకీయాల్లో అరుదైన పరిణామం. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి వ్యూహాల ముందు, మారిన ప్రజల తీర్పు ముందు వైఎస్సార్‌సీపీ ఆటలు సాగవనే చేదు నిజం అంబటికి స్పష్టంగా బోధపడిందని ఈ వ్యాఖ్యలు చెబుతున్నాయి. సొంత పార్టీని స్వయంగా ఆత్మపరిశీలనలోకి నెట్టేలా ఆయన మాట్లాడటం వెనుక..వైఎస్సార్‌సీపీ పరిస్థితి ఎంతటి దారుణమైన స్థితికి చేరిందో అర్థమవుతోంది.

Also Read : అప్పుడు ఒప్పు.. ఇప్పుడు తప్పా.. ఇదేం లాజిక్ రాధికా?

రాజకీయాల్లో వాస్తవాలను దాచిపెట్టడం కొంతకాలమే సాధ్యమవుతుంది. కానీ, ఏ ఎన్నిక వచ్చినా కూటమిదే విజయమని వైఎస్సార్‌సీపీకి చెందిన కీలక నేతే బాహాటంగా ప్రకటించడంతో, ఆ పార్టీ భవిష్యత్తుపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంబటి రాంబాబు ఓపెన్‌గా ఒప్పుకున్న ఈ రియాలిటీ జగన్ సహా పార్టీ హైకమాండ్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

రామాయణ పార్ట్1 రివ్యూ...

భారతీయులకు చిరపరిచితమైన రామాయణ గాథను భారీ...

ఆధారాలు ఇచ్చేస్తా.. ఈడీ...

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్...

యువగళం హామీ నిలబెట్టుకున్న...

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న...

ఎన్నికల్లో ట్రంప్ కు...

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్...

కేంద్రం వెంటపడుతోన్న సీఎం.....

ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా విరుచుకుపడిన అర్నబ్, మురసు...

ఈవీఎం కాదు.. బ్యాలెట్.....

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో...

పోల్స్