Thursday, November 5, 2026 12:57 PM
Thursday, November 5, 2026 12:57 PM

ఆధారాలు ఇచ్చేస్తా.. ఈడీ ముందు అంబటి ఒప్పేసుకున్నారా..?

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మద్యం రవాణా టెండర్ల నిబంధనలను మార్చి, రూ. 195 కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారనే ఆరోపణలపై ఈడీ మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తోంది. ఈ విచారణలో భాగంగా అంబటి రాంబాబు ముఖ్య అనుచరులైన రాయపాటి పురుషోత్తం, మర్రి సుబ్బారెడ్డిలకు మద్యం రవాణా సబ్ కాంట్రాక్టులు దక్కడంపై అధికారులు ప్రధానంగా ప్రశ్నించారు. నాటి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డితో మాట్లాడి తన అనుచరులకు సబ్ కాంట్రాక్టులు ఇప్పించిన మాట వాస్తవమేనని అంబటి రాంబాబు ఈడీ అధికారుల ఎదుట అంగీకరించినట్లు సమాచారం.

Also Read : ఈవీఎం కాదు.. బ్యాలెట్.. జగన్ కు ఏం అంటారు..?

విచారణ అనంతరం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు రికమండ్ చేసి పని ఇప్పించడం వరకే తన పాత్ర ఉందని, అంతకు మించి ఈ మద్యం కుంభకోణంతో గానీ, ఎలాంటి ఆర్థిక అక్రమాలతో గానీ తనకు వ్యక్తిగతంగా ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అయితే తన వద్ద ఉన్న ఆధారాలను కూడా అంబటి ఈడీ అధికారులకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉండటం, అలాగే విచారణ తీవ్రతను అర్థం చేసుకున్న అంబటి..

Also Read : అప్పుడు ఒప్పు.. ఇప్పుడు తప్పా.. ఇదేం లాజిక్ రాధికా?

తనకు తెలిసిన పూర్తి సమాచారాన్ని, వివరాలను ఈడీ అధికారులకు అందించడంతోనే విచారణ చాలా వేగంగా, కేవలం రెండు గంటల్లోనే ముగిసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఈ నోటీసులు, విచారణ అంతా ప్రస్తుత కూటమి ప్రభుత్వ రాజకీయ కుట్రలో భాగమేనని అంబటి రాంబాబు ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఈడీ ద్వారా ఒత్తిడి తీసుకువస్తున్నారని విమర్శించారు. అయితే, ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కుమార్, మాజీ ఐటీ సలహాదారు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, వాసుదేవరెడ్డి వంటి కీలక వ్యక్తులను ఈడీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో, అంబటి రాంబాబు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ విచారణ తదుపరి ఎలాంటి మలుపులు తిరగబోతుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

రామాయణ పార్ట్1 రివ్యూ...

భారతీయులకు చిరపరిచితమైన రామాయణ గాథను భారీ...

ఏ ఎన్నిక జరిగినా...

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి...

యువగళం హామీ నిలబెట్టుకున్న...

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న...

ఎన్నికల్లో ట్రంప్ కు...

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్...

కేంద్రం వెంటపడుతోన్న సీఎం.....

ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా విరుచుకుపడిన అర్నబ్, మురసు...

ఈవీఎం కాదు.. బ్యాలెట్.....

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో...

పోల్స్