ఏపీ రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టిడిపి నాయకులని వేధించడమే లక్ష్యంగా పెట్టుకుని అక్రమ కేసులు పెడుతూ, అక్రమ అరెస్టులు చేస్తూ టిడిపి నాయకుల, కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీస్తూ వస్తున్నాడు జగన్. చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు, క్యాడర్ మానసిక స్థైర్యాన్ని దెబ్బకొట్టాడనికి కేసుల్ని.. అరెస్టుల్ని జగన్ వాడుకున్నారు. కానీ ప్రతీకారం కోసం పెట్టె ఇలాంటి కేసులు అసలు వర్కవుట్ కావని, రాజకీయాల్లో వేధింపులు అంతిమంగా ఆ పార్టీ నేతకే లాభిస్తాయని చరిత్రలో ఎన్నో సార్లు రుజువు అయింది. ఇప్పుడు మరోసారి అదే నిజం అవుతోంది.
మానసికంగా దెబ్బకొట్టడం అంటే ఏమిటో.. ప్రశాంత్ కిషోర్ ను తన ఇంటికి రప్పించుకోవడం ద్వారా చంద్రబాబు చేసి చూపించారు. నన్ను ప్రశాంత్ కిషోరే గెలిపించాడు అని జగన్ రెడ్డి ఎన్నికలు అయిపోగానే మీడియా ముందు పీకేని చూపించి ప్రకటించుకున్నారు. దానికంటే ఎన్నికల ముందు ప్లీనరీలో పీకేని చూపించి మనల్ని గెలిపించబోతున్నాడని క్యాడర్ కు గర్వంగా పరిచయం చేశాడు. ఇప్పుడు ఆ పీకే చంద్రబాబు ఇంట్లో ఉన్నారు. అంటే ఒకరకంగా జగన్ రెడ్డి గెలుపు చంద్రబాబు ఇంట్లో ఉందన్నమాట. ఇప్పుడు జగన్ రెడ్డి మానసిక పరిస్థితి.. వైసీపీ క్యాడర్ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. పీకే చంద్రబాబు కలిసిన దగ్గర నుంచి వైసీపీ సోషల్ మీడియా షాక్ తో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్న వారిని చూసుంటేనే వారి మానసిక పరిస్థితి ఎలా ఉందొ అర్ధం అవుతుంది. నిన్నటి దాకా పీకే ఉన్నాడనే ధైర్యంతో ఉన్న క్యాడర్
కి ఇప్పుడు జగన్ రెడ్డి గెలుపుపై నమ్మకం లేదు. ఇప్పటివరకు మా వెనుక పీకే ఉన్నారన్న ధైర్యం నింపుకుని ఇంకా పని చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడా పీకే టీడీపీ కాంపౌండ్ లోకి వెళ్లిన తర్వాత ఎవరికైనా గుండె జారిపోకుండా ఉంటుందా?
ఇప్పటికే ఐ ప్యాక్ పేరు మీదనే మొత్తం నడుస్తున్నాయి. అంటే.. ఉద్దేశపూర్వకంగా తమ చేత చేయించాల్సినవన్నీ చేయించేసి.. ఇప్పుడు గంగలోకి నెట్టేస్తున్నారా అన్న భావన రాకుండా ఉంటుందా..? వైసీపీ క్యాడర్ ధైర్యంపై ఇంత కన్నా ఘోరమైన దెబ్బపడుతుందా ? అందరూ దూరమయ్యారు.. జగన్ రెడ్డికి ఓటమే మిగిలింది ! గత ఎన్నికలకు ముందు తల్లి,, చెల్లితో పాటు జగన్ రెడ్డి కోసం పని చేసిన ఎంతో మంది దూరమయ్యారు. చివరికి పీకే కూడా దూరమయ్యారు. దూరం అవడమే కాదు.. వ్యతిరేకంగా పని చేస్తున్నారు. ఇంత కంటే.. పరాజయం ఓ లీడర్ కు ఉండదు. ఎన్నికల్లో నిలబడిన తర్వాత బ్యాలెట్ ద్వారా వచ్చే పరాజయం లాంఛనమే. అసలు పరాజయం ఎప్పుడో ప్రారంభమయింది. ఇక ముగింపు మిగిలింది.