Wednesday, October 21, 2026 08:54 PM
Wednesday, October 21, 2026 08:54 PM

రాచమల్లు.. బరితెగింపు అంటే ఇదే..!

“రాజకీయాల్లో మరీ బరితెగించారు.. ఎంత దారుణమంటే.. మా వాళ్ల మీద దాడులు చేస్తున్నారు. బెదిరిస్తున్నారు. డబ్బులిచ్చి లోబరుచుకుంటున్నారు. మాట వినకపోతే చంపడానికి కూడా వెనకాడటం లేదు. ఇదేనా ప్రజాస్వామ్యం. ఇదేనా పరిపాలన అంటే..?”.. ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు.. సాక్ష్యాత్తు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతున్న మాటలు. ఎన్నికల్లో గెలుపు కోసం బరితెగిస్తున్నారని.. అసలు ఇవి ఎన్నికలే కాదంటున్నారు కూడా. అయితే ఇవన్నీ ఆయన పార్టీ నేతలకే వర్తిస్తాయనే విషయాన్ని వారే రుజువు చేస్తున్నారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి.

Also Read :బ్రేకింగ్: ఏపీ ఎన్నికల కమీషన్ సంచలన నిర్ణయం..!

రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిలర్‌గా, వైస్ చైర్మన్‌గా పనిచేశారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. ప్రొద్దుటూరు నియోజకవర్గం నుండి 2014, 2019లో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా రాచమల్లు బెదిరింపులకు దిగారనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు కూడా రాచమల్లు బెదిరింపుల ధోరణి ఏ మాత్రం తగ్గలేదు. . ప్రొద్దుటూరు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, కూటమి ప్రభుత్వంపై విమర్శలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Also Read : మంత్రి నియోజకవర్గంలో కూటమికి రెబల్స్ తలనొప్పి..!

ప్రొద్దుటూరులో స్థానిక సంస్థల ఎన్నికలు, నామినేషన్ల ప్రక్రియలో అధికార కూటమి పార్టీలు, పోలీసుల తీరుపై రాచమల్లు తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఓటింగ్‌కు ముందే బెదిరిస్తున్నారు. “ఇప్పుడు గెలిస్తే.. సంబరాలు చేసుకోవద్దు.. ఎందుకంటే.. 2029 జూన్‌లో జగన్ గెలిస్తే.. అప్పుడు మాత్రం.. ఇప్పుడు గెలిచిన ప్రతి ఒక్క కౌన్సిలర్ రాజీనామా చేయాల్సిందే.. ఇదే నా మాట” అంటూ బెదిరించారు. ఒక ప్రెస్ మీట్‌లో చుట్టూ ఆడవాళ్లు ఉన్నారనే కనీస ఇంకితజ్ఞానం మరిచిన రాచమల్లు.. బూతులతో రెచ్చిపోయారు. దమ్ముంటే 2029 మే నెలలోపు తనను హత్య చేయాలని సవాల్ విసిరారు. 2029 జూన్‌లో తాను గెలిచిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా అని.. వార్నింగ్ ఇచ్చారు.

Also Read : సుప్రీం తీర్పు పై వైసీపీ ఫేక్ ప్రచారం..!

“జగన్ సీఎం అయిన తర్వాత ప్రస్తుత టీడీపీ కౌన్సిలర్లను మెట్టుతో కొట్టి రాజీనామా చేయిస్తా..” అంటూ బెదిరించారు. అలాగే సీఎంగా జగన్ గెలిచిన మూడో రోజు నుంచే మీ సంగతి తేలుస్తా అంటూ బెదిరించారు. నన్ను చంపండి.. లేకపోతే.. మీ చావు ఖాయం అని రాచమల్లు చెప్పిన మాటలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. హత్యలు ప్రొత్సహిస్తున్నారా.. అని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ నేతలకు వత్తాసు పలుకుతున్న పోలీసులకు చుక్కలు చూపిస్తామంటున్నారు. ఓ వైపు ప్రజాస్వామ్యం అని జగన్ చెబుతుంటే.. ఆయన పార్టీ నేత మాత్రం బరితెగించి బెదిరించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రాచమల్లుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

బ్రేకింగ్: ఏపీ ఎన్నికల...

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో అత్యున్నత...

మంత్రి నియోజకవర్గంలో కూటమికి...

మంత్రి గుమ్మడి సంద్యారాణి ప్రాతినిధ్యం వహిస్తున్న...

SBI ఖాతాదారుల డేటా...

దేశంలోనే అత్యంత పెద్ద ప్రభుత్వ రంగ...

పల్నాడు పాలిటిక్స్‌లో హైటెన్షన్.....

పల్నాడు జిల్లా నరసరావుపేట రాజకీయాల్లో మరోసారి...

తాడేపల్లిలో జగన్ ఎమర్జెన్సీ...

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ...

సుప్రీం తీర్పు పై...

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల చుట్టూ జరుగుతున్న...

పోల్స్