Friday, October 24, 2025 03:26 PM
Friday, October 24, 2025 03:26 PM
roots

24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో పప్పు.. రెస్టారెంట్‌లో సరికొత్త వంటకం

రెస్టారెంట్లలో చెఫ్‌లు రోజు రోజుకూ రకరకాల వంటకాలు తయారు చేస్తూ ఉంటారు. ఆ వంటకాలను స్పెషల్ డిష్‌లుగా ప్రచారం చేస్తే.. వాటిని తినడానికి జనం ఎగబడిపోతూ ఉంటారు. తాజాగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో చేసిన దాల్ ఫ్రై తయారీకి సంబంధఇంచిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. బంగారంతో పప్పు కర్రీని వండడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. దీనికి దాల్ కష్కన్ అని పేరు పెట్టారు. దుబాయ్ ఫెస్టివ్ సిటీ మాల్‌లో చెప్ రణ్ వీర్ బ్రార్.. ఈ దాల్ కష్కన్‌ను తయారు చేశారు. అయితే ఇలాంటి వంటకాలతో ఏంటి ఉపయోగం అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

ఇక ఈ దాల్ కష్కన్‌కు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ‘స్ట్రీట్‌ ఫుడ్‌ రిసిప్’ అనే అకౌంట్ నుంచి పోస్ట్ చేశారు. దుబాయ్ ఫెస్టివ్ సిటీ మాల్‌లో చెఫ్ రణ్‌వీర్ బ్రార్ తయారు చేశారని.. దానికి 24 క్యారెట్ గోల్డెన్ తడ్కే వాలీ దాల్ అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఇక ఈ దాల్ కష్కన్ ధర 58 దిర్హామ్‌లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.1300 ఉంటుందని తెలిపారు. ఇక ఈ దాల్ కష్కన్ తయారీలో నూనేను వాడలేదు. ఆ స్థానంలో బంగారం పూతను ఉపయోగించారు. అయితే ఈ దాల్ కష్క్న్ తయారీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారుతుండటంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

బంగారంతో తయారు చేసిన దాల్ కర్రీ శరీరంలో ఎలా వెళ్తుందని.. ప్రశ్నిస్తున్నారు. ఇక మరికొందరు నెటిజన్లు.. ఈ దాల్ కర్రీని తినాలా లేక భద్రంగా దాచుకోవాలా అని అడుగుతున్నారు. వెల్‌కమ్ టు హెవీ మెటల్ పాయిజన్ అంటూ మరొకరు కామెంట్ చేశారు. రేడియం కా తడ్కా ప్రయత్నించండి అని మరొకరు ట్వీట్ చేశారు. ప్రజలు రోజు రోజుకూ పిచ్చివాళ్లు అయిపోతున్నారన మరో నెటిజన్ ఫైర్ అయ్యాడు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఆ ఇద్దరినీ వదలను.....

పదే పదే విమర్శలు.. ఒకరిపై ఒకరు...

కొలికపూడి శ్రీనివాస్ సస్పెన్షన్...

ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీలో విభేదాలు...

కంపెనీ ట్రిప్ కోసం...

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు...

టీడీపీలో వారికి గ్యారంటీ...

తెలుగుదేశం పార్టీ అనగానే ముందుగా అందరికీ...

కొలికపూడి వర్సెస్ కేసినేని.....

తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు...

త్వరలో మంత్రివర్గంలో భారీ...

ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి సరిగ్గా...

పోల్స్